1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Pentagon releases new batch of UFO files : Unlike anything I had seen

గుర్తు తెలియని ఎగిరే వస్తువులు - కొత్త ఫైళ్లను విడుదల చేసిన పెంటగాన్

ufo files
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) కీలక ఫైళ్లను విడుదల చేసింది. గుర్తు తెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన కొత్త పైళ్ళను విడుదల చేసింది. మొత్తం 40 ఫైళ్లను తన అధికారిక యూఎఫ్‌వో వెబ్‍‌సైట‌్‌లో అందుబాటులో ఉంచింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియోలు, మూడు ఫొటోలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్‌తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్.బి.ఐ, ఇంధన శాఖ వంటి అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించారు. ఎక్కువ భాగం 2010 తర్వాత నమోదైన ఘటనలకు సంబంధించినవే.
 
వీటిలో 2019లో అమెరికా తూర్పు ప్రాంతంలో జరిగిన ఒక ఘటన ఆసక్తికరంగా మారింది. ఓ సైనిక పైలట్ తన 28 ఏళ్ల వైమానిక దళం, నౌకాదళ సేవలో ఇలాంటి వస్తువును ఎప్పుడూ చూడలేదని నివేదికలో పేర్కొన్నాడు. చిన్న ఆకారంలో ఉన్న ఆ వస్తువు అత్యంత వేగంగా నేరుగా ప్రయాణించిందని, 10 నుంచి 15 సెకన్ల పాటు దాన్ని గమనించి వీడియో కూడా తీశామని తెలిపాడు. జూమ్ చేసి చిత్రీకరించేలోపే అది కెమెరా పరిధి దాటి మాయమైందని వివరించాడు.
 
మరో నివేదికలో 2015లో టెక్సాస్ లోని పాంటెక్స్ అణ్వాయుధ కేంద్రం గగనతలంలో గుర్తు తెలియని వస్తువు సంచరించినట్లు వెల్లడైంది. అది ఎలాంటి శబ్దం లేకుండా కదిలిందని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు. అలాగే 2023, 2025లో చైనా సమీపంలోని ఎల్లో సీ, ఈస్ట్ చైనా సీ ప్రాంతాల్లో కూడా అనుమానాస్పద వస్తువులను సైనిక సెన్సార్లు గుర్తించిన వీడియోలను పెంటగాన్ విడుదల చేసింది. అయితే ఇవి గ్రహాంతరవాసుల వాహనాలేనని అమెరికా ప్రభుత్వం ఎక్కడా నిర్ధారించలేదు. ప్రస్తుతం వాటి స్వభావంపై దర్యాప్తు కొనసాగుతోంది. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
అత్యంత వేగవంతమైన ప్రైమ్ డేగా అమెజాన్ 10వ ప్రైమ్ డే