సంబంధిత వార్తలు
- భారత డీఎన్ఏలోనే ఇన్నోవేషన్ ఉంది: ప్రధాని మోదీ
- అధికార అహంకారానికి 2024 ఎన్నికల తీర్పు ఒక చారిత్రాత్మక పాఠం.. పవన్
- గ్రామీణ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన కళాకారుడు భారతీరాజా : ప్రధాని మోడీ
- రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేస్తాను : లింగమనేని రమేష్
- ఏపీలో రాజ్యసభ సీట్ల పంపకం పూర్తి - టీడీపీకి 3, జనసేనకు 1
ప్రపంచంలో అతిపెద్ద మూడో స్టార్టప్ వ్యవస్థగా భారత్ : ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. ఆదివారం ఫ్రాన్స్‌లోని నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో కలిసి చారిత్ర విల్లా కెర్లియాస్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా వారిద్దరూ పలు అంశాలపై సంభాషణలు జరుపుతూ లీనమైపోయారు. విల్లాను కలియతిరుగుతూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు.
విల్లా కెరిలోస్ అనేది 20వ శతాబ్దం ప్రారంభంలో నిర్మించిన ఒక అసాధారణమైన హౌస్ మ్యూజియం. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన ఒక ప్రాచీన గ్రీకు ఉన్నత కుటుంబ నివాసాన్ని నమూనాగా తీసుకుని, ఎంతో నిశితంగా ఆధునిక కాలంలో దీన్ని పునఃసృష్టించారు. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ రివేరా తీరంలో, నైస్, మొనాకో నగరాల మధ్య ఉన్న బ్యూలీ-సర్-మెర్ అనే ప్రాంతంలో ఈ విల్లా ఉంది. మధ్యధరా సముద్రానికి అభిముఖంగా ఒక రాతి ద్వీపకల్పంపై కొలువై ఉన్న ఈ భవనం, ప్రస్తుతం చారిత్రక కట్టడంగా వర్గీకరించబడింది. దీని యాజమాన్య హక్కులను 'ఇనిస్టిట్యూట్ డి ఫ్రాన్స్' కలిగి ఉంది.
అంతకుముందు, నీస్‌లో జరిగిన 'భారత్ ఇన్నోవేట్స్' కార్యక్రమాన్ని మోడీ, మేక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. భారత్లో సంస్కరణల వేగం తగ్గబోదని స్పష్టం చేశారు. దేశంలోని స్టార్టప్ వ్యవస్థ మరింత విస్తరణకు సిద్ధంగా ఉందన్నారు. గత 11-12 ఏళ్లలో బలమైన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించుకున్నామని, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా భారత్ అవతరించిందని గుర్తు చేశారు. ప్రపంచ సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలు అభివృద్ధి చేసేందుకు తమతో కలిసి పనిచేయాలని ప్రపంచ ఆవిష్కర్తలను ఆయన ఆహ్వానించారు.
