1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Poor thing : Iran mocks Donald Trump as viral buffalo resembling his loses appetite

ట్రంప్ పోలికలతో దున్నపోతు... షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ (వీడియో)

buffalo - trump
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్ దేశం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌‍ను హేళన చేస్తూ ఓ పోస్టు పెట్టింది. బంగ్లాదేశ్‌లో ట్రంప్ పోలికలతో ఉన్న ఒక తెల్ల దున్నపోతుకు సంబంధించిన వీడియోను రష్యాలోని ఇరాన్ అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ట్రంప్‌తో పోల్చడం వల్ల మనస్తాపానికి గురైన ఆ మూగజీవం ప్రస్తుతం తిండి తినడం మానేసింది అంటూ వ్యంగ్యంగా రాసుకొచ్చింది. 
 
బంగ్లాదేశ్‌లోని నారాయణ్ గంజ్‌ జిల్లాలో 700 కిలోల బరువున్న ఈ వింత దున్నపోతు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెల్సిందే. దాని తలపై ఉన్న జుట్టు ముఖ కవళికలు కూడా డోనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్నాయనంటూ నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఆ దున్నపోతు యజమాని సరదాగా దానికి డోనాల్డ్ ట్రంప్ అని పేరు పెట్టుకున్నారు. రాబోయే బక్రీద్ పండుగ నేపథ్యంలో దీన్ని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి ప్రజలు తరలివస్తున్నారు. అయితే, ఈ బక్రీద్ దాన్ని బలివ్వక తప్పదని యజమాని చెప్పడం చాలా మందిని నిరాశలకు గురిచేస్తోంది. 

 
About Writer
ఠాగూర్