1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Raped by 600-700 men : Horrific survivor accounts reignite debate over Pakistani grooming gangs in Britain

మూడేళ్లలో ఆ మహిలపై 600 మంది అత్యాచారం చేశారు...

victim woman
బ్రిటన్‌లో ఓ మహిళపై ఏకంగా 600 నుంచి 700 సార్లు అత్యాచారం చేశారని బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు రూపెల్ట్ లోవ్ వెల్లడించారు. తమ దేశంలో లైంగిక వేధింపులు ముఠాల అరాచకాలపై అక్కడి చట్టసభలో ఆయన మరోమారు చర్చించారు. అనేక రాష్ట్రాల్లో చిన్నారులు, మహిళల లైంగిక దోపిడీకి సంబంధించి స్వతంత్ర దర్యాప్తు నివేదికలోని సంచలన విషయాలను బాహ్య ప్రపంచం ముందుంచింది. 
 
వ్యవస్థీకృత ముఠాల వేధింపులు, అత్యాచారాలు, పోలీసులు వ్యవహరించిన తీరు, తదితర అంశాలపై బాధితులు, సాక్ష్యులు ఇచ్చిన వాంగ్మూలాలను కొందరు చట్టసభ సభ్యులు వివరించారు. అయితే, ఈ దారుణాలకు పాల్పడిన వారిలో ఎక్కువశాతం పాకిస్థాన్‌ మూలాలున్న ట్యాక్సీ డ్రైవర్లు, వ్యాపారులే ఉన్నట్లు గతంలో తేలిన విషయం తెలిసిందే.
 
బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యుడు రూపెల్ట్‌ లోవ్ మాట్లాడుతూ.. 'లైంగిక దాడులకు గురైన వారిలో ఎంతో మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. మైనర్‌గా ఉన్నప్పుడే తనపై లైంగిక దాడి జరిగిందని ఓ బాధితురాలు చెప్పింది. మూడేళ్లలో ఆమెపై 600-700 మంది అత్యాచారం చేసినట్లు ఆవేదన వ్యక్తం చేసింది. 
 
తన ప్రైవేటు భాగాలను తీవ్రంగా గాయపరిచినట్లు మరో మహిళ పేర్కొంది. బాధితులను జంతువుల్లా చూసినట్లు అనేక మంది చెప్పారు. శ్వేతజాతీయులనే లక్ష్యంగా చేసుకొని ఈ ముఠాలు లైంగిక హింసకు పాల్పడ్డాయని మరికొందరు బాధితులు వాంగ్మూలం ఇచ్చారు. కొందరు పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపైనా అనేక ఆరోపణలు ఉన్నాయి' అని వివరించారు. ఇలాంటి దురాగతాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని చట్టసభ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.
 
బ్రిటన్‌లో లైంగిక వేధింపుల ముఠా అరాచకాల విషయం 2002లో తొలిసారి వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌ మూలాలున్న అనేక మంది.. దేశవ్యాప్తంగా కొన్ని వర్గాల అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సౌత్‌ యార్క్‌షైర్‌లో 2010లో కొందరు మైనర్‌ అమ్మాయిలను వేధించిన కేసులో పాక్‌ మూలాలున్న ఐదుగురు దోషులుగా తేలడం అప్పట్లో సంచలనం రేపింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
అనంతపురం హాస్టల్‌లో 19ఏళ్ల డిగ్రీ విద్యార్థిని అనుమానస్పద మృతి