సంబంధిత వార్తలు
- Beijing : పుతిన్‌తో భేటీ అయిన కిమ్ జోంగ్- రష్యా ప్రజలకు నేను ఏదైనా చేయగలిగితే?
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కుప్పకూలిపోయిన యువకుడు.. ఆ తర్వాత?
- ట్రంప్- పుతిన్ భేటీ సక్సెస్.. ఇక జెలెన్స్కీకి, నాటో మిత్రపక్షాలకు ఫోన్ చేసి మాట్లాడుతా
- US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు
- శుద్ధి చేసిన యురేనియంను మాకు ఇస్తారా లేదా నాశనం చేస్తారా? ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తాం : వ్లాదిమిర్ పుతిన్
సైన్యంలో చేరితే రూ.1.33 కోట్ల రుణం నుంచి విముక్తి కల్పిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. అతి చిన్నదేశమైన ఉక్రెయిన్‍తో గత నాలుగేళ్లుగా రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. ఈ యుద్ధంలో రష్యా అనేక మంది సైన్యాన్ని కోల్పోయింది. దీంతో సైన్యంలో కొత్తగా యువతను చేర్చుకునే అంశంపై దృష్టిసారిస్తోంది. దీంతో సైన్యంలో చేరేవారికి అనేక రకాలైన ప్రోత్సాహకాలను కల్పిస్తోంది. ఇందులోభాగంగా, సైన్యంలో చేరే యువత కుటుంబాలకు ఉండే రుణాల్లో 10 మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.1.33కోట్లు) వరకు రుణం నుంచి విముక్తి కలిగిస్తామని ప్రకటించారు.
ఇందుకు సంబంధించిన నిర్ణయంపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. అయితే, మే 1వ తేదీకి ముందు రుణాలు ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని సమాచారం. కొత్తగా సైన్యంలో చేరాలనుకునే వారు కనీసం ఏడాది పాటు కొనసాగుతానని హామీ ఇవ్వాల్సి ఉంటుందని తాజా నిబంధనల్లో పేర్కొన్నారు.
రష్యా - ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా జరుగుతోన్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నేతృత్వంలో ఇటీవల కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఇరువర్గాలతో కలిపి శాంతి చర్చలు జరిపినప్పటికీ.. అవి మధ్యలోనే నిలిచిపోయాయి.
ఈ తరుణంలో తన బలగాలను పెంచుకునేందుకు క్రెమ్లిన్ అనేక చర్యలు చేపడుతోంది. యుద్ధంలో పాల్గొనేవారికి భారీ మొత్తంలో నగదు చెల్లింపులు, ఉన్నత విద్య ప్రవేశాల్లో ప్రాధాన్యం సహా పలు రకాల ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటిస్తోంది.
తర్వాతి కథనం
