బుధవారం, 18 ఫిబ్రవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 నవంబరు 2025 (19:17 IST)

సౌదీ బస్సు ప్రమాదం.. 45మంది మృతి.. ప్రాణాలతో మిగిలిన ఒకే ఒక వ్యక్తి

Saudi bus crash
Saudi bus crash
సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన 45 మంది భారతీయ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. మక్కా నుండి మదీనాకు యాత్రికులను తీసుకెళ్తున్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
 
46 మందితో వెళ్తున్న బస్సు ప్రమాదంలో మంటలు చెలరేగి, ఘోర ప్రాణనష్టానికి దారితీసింది. ఈ ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. 24 ఏళ్ల మహ్మద్ అబ్దుల్ షోయబ్, డ్రైవర్ పక్కన కూర్చుని మంటల నుండి తప్పించుకున్నాడు. 
 
ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న షోయబ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడి కాలేదు. విషాదకరమైన విషయం ఏంటంటే.. షోయబ్ కుటుంబం మొత్తం ఈ ప్రమాదంలో మరణించినట్లు తెలుస్తోంది.