సంబంధిత వార్తలు
- నేను రేపిస్టును కాదు... నేను ఎవరినీ రేప్ చేయలేదు : డోనాల్డ్ ట్రంప్
- కూల్‌డ్రింక్స్ అందించే ట్రాలీ గది సమీపంలో నక్కిన నిందితుడు కోలో టోమోస్ అలెన్
- మదనపల్లి మైనర్ బాలిక హత్యాచార కేసు నిందితుడి కథ అలా ముగిసింది....
- వడ్డీ వ్యాపారుల వేధింపులు - పురుగుల మందు సేవించి దంపతుల ఆత్మహత్య
- సిడ్నీ ఉగ్రదాడి నిందితుడు సాజిద్ హైదరాబాదీయేనట
వైట్‌హౌస్ సమీపంలో కాల్పులు.. చంపేసిన సీక్రెట్ సర్వీస్ అధికారుల
అమెరికా అధ్యక్షభవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పులకు తెగబడిన దుండగుడిని సీక్రెట్ సర్వీస్ అధికారులు చాల్చి చంపేశారు. మృతుడుని నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. కొన్నేళ్లుగా అతడు వైట్ హౌస్ సమీపంలోని భద్రతా చెక్‌పాయింట్ల వద్ద పలుమార్లు అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు వెల్లడించారు.
ఏడాది క్రితం రెండు సార్లు వైట్‌హౌస్ సమీపంలోని నిషేధిత ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో ఆ ప్రాంగణానికి దూరంగా ఉండాలని కోర్టు అతడికి ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. నిందితుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ కాష్ పటేల్ మాట్లాడుతూ.. దాడి వెనుక ఏదైనా రాజకీయ కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. వైట్‌హౌస్ సమీపంలో దుండగులు తరచూ దాడులకు పాల్పడుతుండడంతో పోలీసులు, ఇతర బలగాలతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామన్నారు.
కాగా, శనివారం అర్థరాత్రి అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌథం సమీపంలోని సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్దకు దూసుకొచ్చిన నసీర్ బలగాలపై కాల్పులకు దిగాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరపగా నిందితుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు తెలిపారు. దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిగాయని పేర్కొన్నారు.
ఆ సమయంలో అధ్యక్షుడు ట్రంప్ శ్వేతసౌధంలోనే ఉన్నారు. ట్రంప్‌పై గతంలోనూ అనేకసార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఏప్రిల్‌లో వాషింగ్టన్ హిల్టన్ హోటల్‌లో నిర్వహించిన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అధ్యక్షుడు ట్రంప్, ఆయన సతీమణి మెలానియాతోపాటు ఇతర ఉన్నతాధికారులను సురక్షిత ప్రాంతానికి తరలించడంతో నాడు ప్రమాదం తప్పింది.
