1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Sonu Sood Reaches Nepal With Relief Supplies for Flood Victims

Sonu Sood: నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్

Sonu Sood
గత వారం నేపాల్‌ను అతలాకుతలం చేసిన భారీ వరదల బాధితులకు అండగా నిలిచేందుకు నటుడు సోనూ సూద్ అక్కడికి చేరుకున్నారు. ఆయన బృందం సహాయక చర్యలను సమన్వయం చేస్తోంది. 
 
తన సూద్ ఛారిటీ ఫౌండేషన్ బృందం భారతదేశం నుండి అత్యవసర సామగ్రిని తీసుకువచ్చిందని, రాబోయే నెలల్లో కూడా ప్రభావిత ప్రజలకు మద్దతునిస్తూనే ఉంటామని సోనూ సూద్ తెలిపారు. తాము వరద బాధితులను కలవడానికి ఇక్కడికి వచ్చామన్నారు. 
 
భారతదేశం నుండి చాలా సామాగ్రిని తీసుకువచ్చామని.. ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలవాలని, వారి జీవితాలను తిరిగి గాడిలో పెట్టడానికి ప్రయత్నించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.
 
ఈ సహాయక చర్యల్లో దుప్పట్లు, ఆహార పదార్థాలు ఉన్నాయని, అలాగే క్షేత్రస్థాయిలో ఇంకా ఏమేమి అవసరమో తమ బృందం పరిశీలిస్తోందని సోనూ సూద్ చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించడం అవసరమని తాను భావిస్తున్నమని.. వరదబాధితులకు ఇంకా ఏం అవసరమనే విషయాలను అడిగి తెలుసుకుంటున్నామని చెప్పారు. వాటిని భారతదేశం నుండి పంపడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. 
 
భారతదేశం నుండి నేపాల్‌కు సామాగ్రిని తరలించడం ఎప్పుడూ కొంత సవాలుతో కూడుకున్న పనే, ఎందుకంటే దీనికి చాలా మంది సిబ్బంది అవసమని ఆయన పేర్కొన్నారు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఏపీలో పెరిగిన పగటిపూట ఉష్ణోగ్రతలు- నిర్మానుష్యంగా విశాఖపట్నం బీచ్ రోడ్డు