ఆదివారం, 18 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 డిశెంబరు 2025 (13:25 IST)

కూలిపోయిన స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం (video)

Statue of Liberty
తీవ్రమైన గాలులకు స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం కూలిపోయింది. సోమవారం మధ్యాహ్నం బ్రెజిల్‌లోని గుయిబా నగరంలో తీవ్రమైన తుఫాను సంభవించడంతో దాదాపు 40 మీటర్ల పొడవైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ప్రతిరూపం కూలిపోయింది. దక్షిణ బ్రెజిల్ అంతటా తుఫాను పెనుగాలులు వీచాయి. ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్ సమీపంలోని హవాన్ రిటైల్ మెగాస్టోర్ యొక్క కార్ పార్కింగ్‌లో ఏర్పాటు చేసిన విగ్రహంపై తీవ్రమైన గాలులు వీచాయి. గాలి శక్తికి ఆ విగ్రహం క్రమంగా వంగిపోతూ పడిపోయింది. ఆ విగ్రహం నేలకొరిగి రోడ్డుకి ఢీకొన్నప్పుడు విగ్రహం తల ముక్కలైంది.
 
ఈ ప్రతిరూపం దాదాపు 114 అడుగుల ఎత్తులో ఉంది. ఐతే ఇందులో 36 అడుగుల పీఠం చెక్కుచెదరకుండా ఉంది. కాగా ఈ విగ్రహం కూలినందువల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, సంఘటన స్థలం నుంచి శకలాలను తొలగించారు. తుఫాను తీవ్రత సమయంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.