ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 14 మార్చి 2026 (21:41 IST)

ఇరాన్ దేశాన్ని ఆపండి ఫ్రెండ్స్: ట్రంప్ విజ్ఞప్తి

donald trump
భయంతో వున్నవాడు పోరాటం చేయలేడు కానీ చావుని లెక్కచేయని వాడు ఏదైనా చేస్తాడని చెబుతుంటారు. ఇప్పుడు ఇరాన్ దేశం వ్యవహారం అలాగే వుంది. ఒకవైపు అమెరికా-ఇజ్రాయెల్ సేనలు ఇరాన్ దేశం పైన బాంబులు వర్షం కురిపిస్తున్నా, కీలక స్థావరాలను నేలమట్టం చేస్తున్నా వారు మాత్రం ఏమీ వెనక్కి తగ్గడంలేదు.
 
శనివారం నాడు ఇజ్రాయెల్ దేశంపైన ఒక్కసారిగా 1430 క్షిపణులతో విరుచుకుపడింది. దీనితో ఇజ్రాయెల్ దేశంలో సైరన్ల మోత మోగాయి. ప్రజలంతా సురక్షిత ప్రాంతాలలో తలదాచుకున్నారు. ఐనప్పటికీ పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కొన్ని భవనాలు దెబ్బతిన్నాయి. ఆకాశంలోనే ఆ క్షిపణులను నాశనం చేసినప్పటికీ భారీ సంఖ్యలో ఇరాన్ ప్రయోగించడంతో డ్యామేజ్ అయినట్లు చెబుతున్నారు. మరోవైపు హార్మూజ్ జలసంధి వద్ద ఒక్క నౌకను కూడా వెళ్లనీయకుండా ఇరాన్ అడ్డుకోవడంతో వారిని నిలువరించేందుకు మిత్రదేశాలు కూడా రంగంలోకి దిగాలంటూ డొనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి చేసారు.
 
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఇరాన్ చంపేసిందా?
సోషల్ మీడియాలో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu)పై ఇరాన్ దాడి చేసి చంపేసిదంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి ఇదే టాపిక్ పైన చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రయాణిస్తున్న విమానంపై ఇరాన్ దాడి చేసిందనీ, ఈ దాడిలో నెతన్యాహు మరణించాడంటూ కొందరు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఐతే ఈ వీడియో నిజమైనదా లేదంటే ఫేక్ వీడియోనా తేలాల్సి వుంది. 
 
మరోవైపు నెతన్యాహు మృతి చెందాడంటూ అంతర్జాతీయంగా కూడా పలు ఛానళ్లు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా నెతన్యాహు బైటకు కనిపించకపోవడంతో మరీ అనుమానాలు బలపడుతున్నాయి. ఇంతకీ అసలు నెతన్యాహు బ్రతికే వున్నాడా లేదంటే చనిపోయాడా అనేదానిపై ఇప్పుడు అంతా అయోమయంలో వున్నారు. దీనిపై ఇజ్రాయెల్ స్పష్టత ఇవ్వాల్సి వుంది.