సంబంధిత వార్తలు
- ఇజ్రాయెల్-హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ మధ్య కాల్పుల విరమణ.. 3 వారాల పొడిగింపు
- MAGA AI క్వీన్‌తో వేలాదిమంది అమెరికన్లను పూర్తి మూర్ఖులుగా చేసి కోట్లు గడించిన భారతీయ వైద్య విద్యార్థి
- అమెరికా రక్షణ వ్యవస్థ విఫలం - గల్ఫ్ దేశాలకు చుక్కలు చూపిస్తున్న ఇరాన్
- మాకు కావాల్సిందల్లా అదొక్కట్టే.. శాంతి చర్చలు.. పాకిస్థాన్ పర్యటనకు డొనాల్డ్ ట్రంప్
- తొలి క్షిపణి దాడికే అమెరికా నౌకలన్నీ జలగర్భంలో మునిగిపోతాయ్ : ఇరాన్ హెచ్చరిక
కూల్‌డ్రింక్స్ అందించే ట్రాలీ గది సమీపంలో నక్కిన నిందితుడు కోలో టోమోస్ అలెన్
అమెరికాలో వైట్‌హౌస్ మీడియా కరస్పాండెంట్ల డిన్నర్‌లో కాల్పులు జరిపేందుకు హిల్టన్ హోటల్‌లోనే నిందితుడు ఆయుధాన్ని సిద్ధం చేశాడని, ప్రత్యక్ష సాక్షిని ఉటంకిస్తూ అమెరికా మీడియా ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రత్యక్ష సాక్షి హెలెన్ మబుస్ అనే వాలంటీర్ మాట్లాడుతూ.. బార్ కార్ట్స్ (శీతల పానీయాలను అందించే ట్రాలీలు) ఉంచే గది సమీపంలో భద్రతా పెద్దగా ఏర్పాట్లు లేవని పేర్కొంది. నిందితుడు కోలో టామోస్ అలెన్ అదే గదిలో ఉన్నట్లు వెల్లడించింది.
అలెన్ ఓ బ్యాగ్‌ను తీసి పొడవైన గన్‌ను బయటకు లాగినట్లు మబుస్ వెల్లడించింది. ఆ తర్వాత అతడు హఠాత్తుగా డిన్నర్ జరుగుతున్న బాల్‌రూమ్ వైపు గన్‌ను తీసుకొని పరిగెత్తాడని వెల్లడించింది. ఈ క్రమంలో అన్ని దిశల్లో ఇష్టం వచ్చినట్లు కాల్పులు జరిపాడని పేర్కొంది. సుమారు 10 రౌండ్ల వరకు కాల్చినట్లు తెలిపింది.
ఈ క్రమంలో సీక్రెట్ సర్వీస్ .. ఇతర భద్రతా దళాలు అతడిని పట్టుకొనేందుకు పరుగులు పెట్టారు. తాను పూర్తిగా వ్యతిరేక దిశలో పారిపోయినట్లు హెలెన్ మబుస్ వెల్లడించారు. తాను ట్రంప్ కార్యవర్గంలోని నిందితులను లక్ష్యంగా చేసుకొన్నట్లు నిందితుడు అలెన్ అధికారుల వద్ద ఇప్పటికే అంగీకరించినట్లు అమెరికా మీడియా వెల్లడించింది.
తాను పాల్గొన్న కార్యక్రమంలో కాల్పులకు.. ఇరాన్ యుద్ధంతో సంబంధం ఉందని తాను భావించడంలేదని.. కానీ, ఏదీ చెప్పడానికి వీల్లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఓ విలేకరి ఆయన్ను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తాను ఇరాన్ యుద్ధంలో విజయం సాధించకుండా ఏదీ భయపెట్టలేదని స్పష్టం చేశారు.
తర్వాతి కథనం
