శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 ఏప్రియల్ 2015 (14:05 IST)

జూలై 2,3,4 తేదీల్లో బ్రహ్మాండంగా తానా మహాసభలు... లీలాప్రసాద్

డిట్రాయిట్‌లో జూలై 2,3,4 తేదీలలో జరుగబోతున్న తానా మహాసభలకు సాంస్కృతిక ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. TANA ప్రెసిడెంట్ శ్రీ మోహన్ నన్నపనేని గారు మరియు కాన్ఫరెన్స్ కో-ఆర్డినేటర్ శ్రీ గంగాధర్ నాదెండ్లగారి ఆధ్వర్యంలో జరుగుతున్న 20వ తానా మహాసభల కోసం భారతదేశం నుండి వివిధ రంగాల ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. TANA మహాసభల కొరకు విభిన్నమైన కార్యక్రమాలు రూపొందిస్తున్నట్లు సాంస్కృతిక విభాగం చైర్‌పర్సన్ శ్రీ లీలాప్రసాద్‌గారు చెప్పారు.

 
పబ్లిసిటీ టీం సాంస్కృతిక విభాగం సభ్యులతో ఇక్కడ జరిగే ఏర్పాట్లు గురించి ముచ్చటించింది. ఆ వివరాలు....
1) తానా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ఎలా ఉండబోతున్నాయి?
 
తానా సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి వినూత్నమైన రీతిలో రూపుదిద్దుకుంటున్నాయి. ఎన్నో అద్భుతమైన, విభిన్నమైన కార్యక్రమాలు  ప్రదర్శింపబోతున్నాము. ఒక్కటిమాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఈ తానా మహాసభలకు విచ్చేసిన ప్రతి  ఒక్కరిని ఆద్యంతం అలరించే విధంగా కార్యక్రమాలు ఉంటాయి.
 
2) మీ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? 
శ్రీ గంగాధర్ నాదెళ్ళ మరియు శ్రీ మోహన్ నన్నపనేని ఆధ్వర్యంలో ఏర్పాట్లన్నీ చాలా చురుకుగా సాగుతున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు దాదాపు 60 మందికి పైగా కార్యకర్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఇతర కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో పనులు నిరాటంకంగా సాగుతున్నాయి.
 
3)గతానికీ ఇప్పటికీ మీ కార్యక్రమాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? 
గతంలో జరిగిన మహాసభల లోటుపాట్లను పరిశీలించి, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే ఇంతకుముందెన్నడూ చూడని కార్యక్రమాలు ఈసారి ప్రేక్షకులు చూడబోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే "అద్భుతం" అనే విధంగా ఉంటాయి.
 
4)ఈసారి కార్యక్రమాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించే కార్యక్రమంగా ఏది నిలుస్తుందని మీ అభిప్రాయం? 
ముందు చెప్పినట్టుగా ప్రతి కార్యక్రమం అన్నివర్గాల ప్రేక్షకులకి నచ్చే విధంగా రూపుదిద్దుకుంటున్నాయి. సినీ రంగం నుంచి ప్రముఖ కమెడియన్స్, ప్రముఖ హీరోహీరోయిన్‌తో కార్యక్రమాలు, ఇంకా ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. (ప్రేక్షకులు ఉత్కంఠతతో చూసే విధంగా ఉంటాయి)
 
5)ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి విధివిధానాలు ఏమిటి? కార్యక్రమాల్లో పాల్గొనడానికి సభ్యత్వం కాకుండా వేరే ఫీజులు ఏమైనా ఉన్నాయా? 
తానా కార్యక్రమాల్లో పాల్గొనడానికి విధి విధానాలు, మరియు ఎంట్రీ ఫి వివరాలు అన్ని తానా వెబ్ సైట్ లో పొందవచ్చు. మరిన్ని వివరాలకు tana2015.org చూడవచ్చు.
 
6) ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొనేందుకు సంబంధించిన విషయాలు ఎలా తెలుసుకోవచ్చు? 
ఈ కార్యక్రమాలలో పాలుపంచుకొనేందుకు అన్ని వివరాలు ఈ లింక్ ద్వారా పొందవచ్చు 
tana2015.org/content/doc/guidelines-tana-culturalprogram.pdf చూడవచ్చు. అలాగే మీ సందేహాలు [email protected]కు పంపవచ్చు. 
 
7) తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాల గురించి చెప్పండి (కవి సమ్మేళనాలు, రచనలు, హరికథలు, తెలుగు నాటకాలు, తెలుగు పండగలు...)
ఈ మహాసభలలో గరికపాటి నరసింహారావు, మేడసాని మోహన్, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖ సాహిత్యకారులతో పాటు, ఎందరో కవులతో, రచయితలతో మన తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఎన్నో కార్యక్రమాలు రూపొందిస్తున్నాము.
 
8) ఈ కార్యక్రమానికి భారత దేశం నుండీ వస్తున్న ప్రముఖుల గురించి  చెప్పండి. వారితో ఏమైనా ప్రదర్శనలు ఉంటాయా? 
సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా టీవి / సినీ ప్రముఖులు ఎంతో మంది పాల్గొనడానికి విచ్చేస్తున్నారు. దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అల్లరి నరేష్, శివాజీ, సుమ, ఝాన్సీ, అలీ, రవిబాబు, శివారెడ్డి ఇంకా ఎందరో సినీ ప్రముఖులు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరందరితో ఎన్నో ఆకర్షణీయమైన కార్యక్రమాలు ప్రదర్శనకు సిద్ధం గా వున్నాయి. మరిన్ని వివరాలు tana2015.org వెబ్ సైట్ లో పొందవచ్చు.