గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 10 అక్టోబరు 2014 (14:53 IST)

టెక్కీ భవిశ్య - భర్త కార్తీక్‌ల మధ్య విభేదాలు లేవు ... ఏడీసీపీ

హైదరాబాద్ టెక్కీ భవ్యశ్రీకి ఆమె భర్త కార్తీక్‌ మధ్య ఎలాంటి కుటుంబ కలహాలు లేదా మనస్పర్థలు లేవని హైదరాబాద్ మాదాపూర్ అడిషినల్ ఏసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. ఇదే ఈ అదృశ్యం కేసుపై ఆయన స్పందిస్తూ... భవిశ్య అదృశ్యం కేసులో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన శుక్రవారమిక్కడ చెప్పారు. 
 
హైదరాబాద్‌లో ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మిస్సింగ్ అయిన విషయం తెల్సిందే. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ అనే టెక్కీ కనిపించకుండా పోయారు. గురువారం ఉదయం ఆమె క్యాబ్లో ఆఫీసుకు బయలుదేరిన ఆ తర్వాత సాయంత్రం ఇంటికి చేరుకోలేదు. తాను ఆఫీసుకు క్యాబ్లో వెళ్తున్నట్లుగా భర్తకు భవ్యశ్రీ సెల్ఫోన్లో మెసేజ్ కూడా పెట్టింది. దాంతో తన భార్య కనిపించడంలేదంటూ భవ్యశ్రీ భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
 
ఈ అదృశ్యం వివరాలను పరిశీలిస్తే.. విజయవాడకు చెందిన భవ్యశ్రీ చరిత, కార్తీక్ సుమారు రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కేపీహెచ్బీ కాలనీలోని ఏడో ఫేజ్లో నివాసముంటున్నారు. గురువారం ఉదయం 9 గంటలకు తాను క్యాబ్లో ఆఫీసుకు బయల్దేరినట్లు ఆమె భర్తకు మెసేజ్ పెట్టింది. సుమారు గంట తర్వాత కార్తీక్ ఫోన్ చేయగా, ఆమె ఫోన్ ఆన్సర్ చేయలేదు. ఆఫీసులో బిజీగా ఉందనుకుని ఊరుకుని మళ్లీ మధ్యాహ్నం, సాయంత్రం ట్రై చేసినా ఫలితం లేదు. దాంతో ఆఫీసుకు వెళ్లి అడిగితే.. అక్కడివాళ్లు ఆమె రాలేదని చెప్పారు. 
 
ఆ తర్వాత భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆఫీసుకు వెళ్లి విచారించగా, ఆమె గత కొన్ని రోజులుగా విధులకు హాజరుకావడం లేదని సమాధానమిచ్చారు. దాంతో ఆమె తనంతట తానే ఎక్కడికైనా వెళ్లిపోయిందా లేక ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా అనే కోణంలో కూకట్పల్లి పోలీసులు విచారణ సాగిస్తున్నారు. భవిశ్య అదృశ్యం కావడానికి కుటుంబ కలహాలు కూడా ఓ కారణంగా ఉండివుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.