1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Thailand Tragedy: 8 Buddhist Monks Killed After Pickup Truck Hits Pilgrimage

11 యేళ్ల బాలుడి నిర్లక్ష్యం - 8 మంది సన్యాసులు దుర్మరణం (Video)

Thailand Tragedy
థాయ్‌లాండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. 11 యేళ్ల బాలుడి నిర్లక్ష్యాన్ని ఏకంగా ఎనిమిది మంది సన్యాసులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషాదకర ఘటన థాయ్‌లాండ్‌లోని ముక్దహాన్ అనే ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన విజువల్స్ చూస్తుంటే వళ్లు గగుర్పాటుకు గురవుతుంది. 
 
11 యేళ్ళ చిన్నబాలుడు తన తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారి పికప్ ట్రక్కు వాహనాన్ని తీసుకుని రోడ్డుపైకి వచ్చాడు. అయితే, డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోవడంతో ఆ వాహనం రోడ్డు పక్కన కాలినడకన ఆధ్యాత్మిక యాత్ర (తీర్థయాత్ర) చేస్తున్న బౌద్ధ సన్యాసుల గ్రూపుపైకి దూసుకెళ్లింది. ఆ సమయంలో అక్కడ 35 మంది సన్యాసులు, వారితో పాటు ఐదుగురు అనుచరులు ఉన్నారు. వీరిలో అనేక మంది గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
టెహ్రాన్‌కు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భౌతికకాయం తరలింపు