ఇరాన్‌లో మారణహోమం - ఆందోళనల్లో 2500 మంది మృతి
ఇరాన్‌లో మారణహోమం సాగుతోంది. ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకునిపోయింది. దీంతో ప్రజలు ఆందోళనబాట పట్టారు. వీరిని అణిచివేసేందుకు ఇరాన్ పాలకులు సైన్యాన్న రంగంలోకి దించారు. ఆందోళనకారులను అణిచివేసే క్రమంలో సైన్యం భారీ విధ్వంసాన్ని సృష్టిస్తోంది.
గత కొన్ని వారాలుగా జరుగుతున్న ఈ ఘర్షణల్లో మృతుల సంఖ్య వేలల్లో ఉన్నట్లు తెలియడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇరాన్ ఆందోళనల్లో ఇప్పటివరకు 2,571 మంది మృతి చెందినట్లు అమెరికా కేంద్రంగా పని చేసే మానవ హక్కుల ఉద్యమకారుల వార్తా సంస్థ బుధవారం వెల్లడించింది.
వీరిలో 2,403 మంది ఆందోళనకారులు కాగా.. 147 మంది భద్రతా సిబ్బంది, ప్రభుత్వానికి చెందినవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఆందోళనలతో సంబంధం లేని 12 మంది చిన్నారులు, 9 మంది పౌరులు చనిపోయినట్లు సదరు సంస్థ పేర్కొంది. ఇప్పటివరకు 18,000 మందికి పైగా నిరసనకారులను భద్రతాధికారులు అరెస్ట్ చేశారు. ఈ ఘర్షణల్లో మరణాల సంఖ్య మరింత పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది.