సంబంధిత వార్తలు
- ఇరాన్ ప్రతినిధుల హత్యకు ఇజ్రాయెల్ కుట్ర? అమెరికా ఆందోళన
- హైదరాబాదులో డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ.. అపూర్వమైన గౌరవం.. ట్రంప్ కృతజ్ఞతలు
- హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు
- హర్మూజ్ జలసంధి అమెరికా క్యాసినో కాదు : ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్
- కోడి ముందు పుట్టిందా లేక గుడ్డు ముందు పుట్టిందా అనే సమస్య లాంటిదే... జేడీ వాన్స్
ఖమేనీ అంత్యక్రియల్లో ప్రజల కన్నీళ్లు నకిలీ అయి వుండొచ్చు.. ట్రంప్
ఖమేనీ అంత్యక్రియల దృష్ట్యా శాంతి చర్చలకు వారం రోజుల పాటు విరామం ఇచ్చామని, ఈ సమయంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకూడదని ఒప్పందం కుదిరిందని శనివారం 'యాక్సియోస్' మీడియా సంస్థకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఒక ఒప్పందం కోసం ఇరాన్ నేతలు ప్రాధేయపడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో, ఖమేనీ అంత్యక్రియల ప్రసారాలను తాను టీవీలో చూశానని, ప్రజలు ఏడవడం చూసి ఆశ్చర్యపోయానని ట్రంప్ చెప్పారు. ప్రజలు ఖమేనీని ద్వేషిస్తారని తాను భావించానని, వారి కన్నీళ్లు బహుశా నకిలీ అయి ఉండొచ్చని ఎద్దేవా చేశారు.
ట్రంప్ వ్యాఖ్యలపై ఆర్మేనియాలోని ఇరాన్ రాయబార కార్యాలయం సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించింది. "మీకు నాగరికత, చరిత్ర, గౌరవం ఏవీ లేవు.. అందుకే ఈ విషయాలు మీకు అర్థం కావు" అంటూ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది.
మరోవైపు ఇరాన్ సైనిక కమాండర్ అలీ అబ్దుల్లాహి శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ.. ఇరాన్పై ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడినా తమ సాయుధ దళాల నుంచి తీవ్రమైన ప్రతీకారం తప్పదని అమెరికా, ఇజ్రాయెల్లను హెచ్చరించారు. ఈ నెల 3న మొదలైన ఖమేనీ అంత్యక్రియల ఊరేగింపుల కార్యక్రమం 9న ఆయన స్వస్థలమైన మషద్‌లో ముగుస్తుంది.
మరోవైపు, ఖమేనీ కుమారుడు ముజబా ఖమేనీని కూడా హతమారుస్తామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ హెచ్చరించడంతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఫ్చి తీవ్రంగా స్పందించారు. తమ ప్రజలకు గానీ, నాయకత్వానికి గానీ ఎలాంటి ముప్పు వచ్చినా తక్షణమే శక్తిమంతమైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
కాగా, భద్రతా కారణాల దృష్ట్యా ముస్తబా ఖమేనీ తన తండ్రి అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొనే అవకాశం లేదని భారతదేశంలోని సుప్రీం లీడర్ ప్రతినిధి అయతొల్లా హకీమ్ ఎలాహి పేర్కొన్నారు.
