గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 12 డిశెంబరు 2015 (21:51 IST)

అతినిద్ర అనర్థదాయకం... ఎన్ని గంటలు దాటి నిద్రపోతే ప్రమాదం...

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా.... అతినిద్రా లోలుడు తెలివిలేని మూర్ఖుడు అని ఆనాడు కృష్ణపరమాత్మ చెప్పినట్లు మనం సినిమాల్లో చూశాం. ఇప్పుడు ఇదే నిజమని అంటున్నారు శాస్త్రజ్ఞులు. రోజుకు 9 గంటలకు మించి నిద్రపోయేవారు త్వరగా పరలోకానికి పయనమవుతారని అంటున్నారు. ఆల్కహాల్, ధూమపానం సేవించడం కన్నా ఈ నిద్ర చాలా అపాయమని చెపుతున్నారు. 
 
రోజులో ఎక్కువ గంటలు నిద్రపోవడం, ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల ఉత్పన్నమయ్యే పరిణామాలపై వారు పరిశోధనలు చేశారు. ఈ అంశంపై 2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిని అధ్యయనం చేశాక ఈ నిర్ణయాన్ని వారు తెలిపారు. సరాసరి రోజుకు 6 గంటలు నిద్ర చాలని అంటున్నారు. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయేవారు కూడా ప్రమాదంలో ఉన్నట్లే.