అబ్రక దబ్ర అంటూ ట్రంప్ ఇరాన్ మ్యాజిక్, ఖమేనీ కనబడకుండా పోయాడు, ప్రపంచ నేతలు ఆశ్చర్యం
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మృతి చెందాడు. దీనిపై సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ వస్తున్నాయి. ఎవరికి తోచినట్లు వారు మీమ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిలో ఓ మీమ్ మరింత పాపులర్ అవుతోంది. ఆ వీడియోలో... ఖమేనీ స్టేజిపై వున్న కుర్చీలో కూర్చుని వున్నాడు. Trump Iran Magic పేరున్న నేమ్ ప్లేట్ వేదికకు వెనుక వైపు వుండగా.. ప్రపంచ నేతలు చూస్తూ వుండగానే ట్రంప్ ఓ ఎర్రటి గుడ్డను తీసుకుని ఖమేనీపై కప్పాడు. అనంతరం అబ్రకా దబ్ర అని గుడ్డ తీసేసాడు. ఆశ్చర్యం... గుడ్డ తీయగానే కుర్చీ ఖాళీగా దర్శనమిచ్చింది. ఖమేనీ కనబడకుండా పోయాడు. ఈ విచిత్రం చూసి ప్రపంచ నేతలు చప్పట్లతో సంతోషం వ్యక్తం చేసారు. ఈ వీడియోను మీరు కూడా చూడండి.
ఇరాన్ ప్రతిదాడులు చూసి ట్రంప్ బుర్ర వేడెక్కిపోతుందా?
కేవలం 2 రోజుల్లో ఇరాన్ ఆట కట్టిస్తాం అని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ ఎదురుదాడులు చూసి ఆయన బుర్ర వేడెక్కిపోతుందంటున్నారు. ఒకవైపు ఇరాన్ విచక్షణారహితంగా అమెరికా మిత్రదేశాలపైన బాంబుల వర్షం కురిపిస్తోంది. దీనివల్ల దుబాయ్, ఖతార్, యుఏఇ తదితర దేశాలకు భారీగా నష్టం వాటిల్లుతోంది. దీనిపై ఆయా దేశాలు ట్రంప్ వ్యవహారంపై ఒకింత అసంతృప్తిగా వున్నాయి.
ఉక్రెయిన్ వంటి చిన్న దేశాన్ని లొంగదీసుకునేందుకే రష్యా నాలుగేళ్లుగా పోరాడుతోంది. దాడులు జరుపుతున్నా ఉక్రెయిన్ ఎంతమాత్రం దారిలోకి రావడంలేదు. దీనితో రష్యా ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అట్లాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ఇరాన్ పైన దాడి చేయడం తెలివైన పనికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే ఇరాన్ చేతిలో 11 అణుబాంబులు తయారుచేసేందుకు శుద్ధి చేయబడి యురేనియం వున్నదని అమెరికా అధికారులే చెబుతున్నారు. కనుక ఇరాన్ పైన అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో చెప్పలేని పరిస్థితి వుందని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు యుద్ధం మరో నాలుగైదు వారాలు పట్టవచ్చని అంటున్నారు. ఐతే అది అనుకున్నంత సులభం కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. ఈ యుద్ధం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలా సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు.