బుధవారం, 11 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 22 జనవరి 2026 (10:16 IST)

హమ్మయ్య.. డొనాల్డ్ ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు... ఆ సుంకాలు రద్దు

donald trump
గ్రీన్‌లాండ్‌ నియంత్రణకు సంబంధించి యూరప్‌లోని అమెరికా మిత్రదేశాలపై విధించ తలపెట్టిన సుంకాలను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షుడు ట్రంప్ బుధవారం ప్రకటించారు. ఆర్కిటిక్ భద్రతకు సంబంధించి అధ్యక్షుడు, నాటో అధినేత ఒక భవిష్యత్ ఒప్పందానికి సంబంధించిన ముసాయిదాపై అంగీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ ద్వీపం యాజమాన్యాన్ని సొంతం చేసుకోవాలని ట్రంప్ ఇంతకు ముందు పట్టుబట్టిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో, దీనిని ఒక ఆకస్మిక యూ-టర్న్‌గా అభివర్ణించారు. 
 
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన 'శాంతి మండలి'లో చేరమని పంపిన ఆహ్వానాన్ని రష్యా పరిశీలిస్తుందని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం తెలిపారు. 
 
మాకు పంపిన పత్రాలను అధ్యయనం చేయాలని, ఈ విషయంపై మా వ్యూహాత్మక భాగస్వాములతో సంప్రదించాలని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించడం జరిగింది... అని పుతిన్ టెలివిజన్‌లో ప్రసారమైన ప్రభుత్వ సమావేశంలో అన్నారు. "ఆ తర్వాతే మేము ఈ ఆహ్వానానికి సమాధానం ఇవ్వగలుగుతామని పుతిన్ తెలిపారు.