1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Trump plans to come directly Islamabad, if Iran agree, there will be peace; otherwise, US will drop bombs, Trump Warning

విమానం ఎక్కి నేరుగా వస్తా, ఒప్పుకుంటే శాంతి లేదంటే బాంబులేస్తా: ట్రంప్ వార్నింగ్

donald trump
ట్రంప్ తట్ట తగలేస్తారేమోనన్న అనుమానాలు ఎక్కువవుతున్నాయి. తట్ట తగలేయడం అంటే మళ్లీ యుద్ధానికి సిద్ధమని చెప్పడమే. బుధవారం నాటితో ఇరాన్-యూఎస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముగియనుంది. నేడు మరోసారి ఇరు దేశాల నేతలతో శాంతి చర్చలు జరపాలని పాకిస్తాన్ పోరాడుతోంది. కానీ పాకిస్తాన్ దేశాన్ని అటు ఇరాన్, ఇటు అమెరికా నమ్మడం లేదు. పాకిస్తాన్ ఎవరికి చెప్పే మాటలు వారికి చెబుతూ వ్యవహారాన్ని ఎగదోస్తోందన్న అనుమానాలు రెండు దేశాలకు వున్నాయి.
 
అందువల్ల పాకిస్తాన్ చేస్తున్న మధ్యవర్తిత్వంపై ఇరాన్ సుముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతి చర్చలకు నేరుగా తనే పూనుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. నేరుగా ఇస్లామాబాద్ వచ్చి ముఖాముఖి చర్చలు చేసి తేల్చేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ అందుకు ఇరాన్ అంగీకరించకపోతే వర్చువల్ డిస్కషన్స్ చేసేందుకు సిద్ధంగా వున్నట్లు సమాచారం.
 
ఈ రెండింటిలోనూ ఇరాన్ తన వైఖరి మార్చుకోకుండా అలాగే మొండిపట్టు పడితే మాత్రం ఇక ఉపేక్షించేది లేదనీ, తమ బలగాలు ఇరాన్ దేశంపై బాంబులు వర్షం కురిపిస్తాయని వార్నింగ్ ఇచ్చారు. అదే కావాలని ట్రంప్ కోరుకుంటే తాము అందుకు సిద్ధమేనంటూ ఇరాన్ సైతం వెనక్కి తగ్గకుండా బదులిస్తోంది. ఈసారి యుద్ధం అంటూ జరిగితే దాని తీవ్రత చాలా భయంకరంగా వుండే ప్రమాదం వుందన్న ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతున్నది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
About Writer
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
దొంగల్లా మారిన పోలీసులు, చెక్కు వివాదం కోసం వచ్చి 22 తులాల బంగారం కొట్టేశారు