1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Trump walked away without signing the temporary ceasefire agreement for the US-Iran conflict, what happens next?

యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయిన ట్రంప్, ఏం జరుగుతుంది?

donald trump
అన్నీ అమెరికాకు అనుకూలంగా వుండాలి. ఏ ఒక్క విషయంలోనూ అది ఇరాన్ దేశానికి అనుకూలంగా అమెరికాకు వ్యతిరేకంగా వుండటానికి వీల్లేదు. ఇదే ట్రంప్ నిర్ణయంలా కనబడుతోంది. అందుకేనేమో... యూఎస్-ఇరాన్ యుద్ధం తాత్కాలిక విరమణ ఒప్పందంపై సంతకం పెట్టకుండా లేచెళ్లిపోయారు ట్రంప్. ఇరాన్(Iran) దేశంతో తాత్కాలిక ఒప్పందంపై నిర్ణయం తీసుకునేందుకు వైట్ హౌస్ సిచ్యువేషన్ రూంలో ట్రంప్ (Doanald Trump) సుమారు 2 గంటలకు పైగా చర్చించారు.
 
ఈ చర్చల్లో ఆయన పలు విషయాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దాంతో ఆయన ఆ డీల్ పైన సంతకం చేయకుండానే అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా డీల్ పైన ట్రంప్ సంతకం చేయకపోవడంపై వైట్ హౌస్ అధికారి ఒకరు మాట్లాడుతూ... ఏ ఒప్పందమైనా అది అమెరికాకు ప్రయోజనకరంగా వుంటేనే దానిని ఆమోదిస్తారని వెల్లడించారు.
 
కాగా ఈ డీల్ ప్రకారం... ఇరాన్ అణ్వాయుధాలను పూర్తిగా త్యజించాలన్నది ప్రధాన డిమాండ్. అలాగే హార్మూజ్ జలసంధిని భేషరతుగా తెరిచి వుంచాలి. ఈ షరతులపైనే ఏకాభిప్రాయం కుదరడంలేదు. దీనితో మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య ఏం జరుగుతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
డిజిటల్ అరెస్టులతో భయపెట్టేవారి తాట తీయండి : సీఎం చంద్రబాబు ఆదేశం