సంబంధిత వార్తలు
- ట్రంప్ పోలికలతో దున్నపోతు... షేర్ చేసిన ఇరాన్ ఎంబసీ (వీడియో)
- Chiru 158 Update: నివేథా పేతురాజ్ మాస్టర్ కు పాఠాలు చెబుతుందా?
- ఇరాన్‌పై భీకర దాడులకు అమెరికా ప్లాన్... కుమారుడి పెళ్లికి దూరంగా ట్రంప్
- డోనాల్డ్ ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ హత్యకు కుట్ర?
- ఇరాన్‌తో ఇపుడు యుద్ధం చేసే ప్రసక్తే లేదు : నెతన్యాహూ - ట్రంప్ మధ్య వాగ్వాదం
హర్మోజ్‌ను తెరుస్తాం.. ఆంక్షలు ఎత్తివేయండి : ఇరాన్ సరికొత్త ప్రతిపాదన
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరాన్ ముందుకు వచ్చింది. ముడి చమురు రవాణాకు ప్రధాన జలమార్గమైన హర్మోజ్ జలసంధని తెరుస్తామని, అయితే, తమపై విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలని కోరింది.
ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవడానికి దగ్గరగా ఉన్నాయని, దీనికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నట్టు అంతర్జాతీయ మీడియా కథనాల సమాచారంగా ఉంది. ఈ ఒప్పందంలో భాగంగా ఇరాన్ తన చమురును అమ్ముకోవడానికి అనుమతించడం, కీలకమైన హర్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం, వివాదాస్పద అణు కార్యక్రమాన్ని నిలువరించడం వంటి అంశాలు ఉన్నట్లు సమాచారం.
ఆక్సియోస్ కథనం ప్రకారం ఈ 60 రోజుల ఒప్పందంలో భాగంగా హర్మోజ్ జలసంధిని ఎలాంటి సుంకాలు లేకుండా తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించింది. నౌకల స్వేచ్ఛా రాకపోకల కోసం అక్కడ ఏర్పాటు చేసిన మైన్లను తొలగించనుంది. దీనికి బదులుగా, అమెరికా ఇరాన్ ఓడరేవులపై దిగ్బంధనాన్ని ఎత్తివేయనుంది. ఇరాన్ చమురు అమ్మకాలకు వీలుగా కొన్ని ఆంక్షలను సడలించడంతో పాటు స్తంభింపజేసిన ఇరాన్ నిధులను కూడా విడుదల చేయనుంది.
అయితే, ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన ఇరాన్ అణు కార్యక్రమంపై మాత్రం ఇరు దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అణ్వాయుధాలను తయారు చేయబోమని, యురేనియం శుద్ధిని నిలిపివేస్తామని ఇరాన్ హామీ ఇవ్వాలని ఒప్పంద ముసాయిదాలో ఉన్నట్లు 'ఆక్సియోస్' పేర్కొంది. కానీ, ప్రాథమిక చర్చల్లో అణు కార్యక్రమం ఉండదని ఇరాన్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇరుపక్షాలు ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చిన తర్వాతే ఈ క్లిష్టమైన అంశంపై చర్చిస్తారని 'న్యూయార్క్ టైమ్స్' కూడా నివేదించింది.
