1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. US President Donald Trump’s team feared Israel wanted to kill Iranian negotiators to derail US-Iran talks: Report

ఇరాన్ ప్రతినిధుల హత్యకు ఇజ్రాయెల్ కుట్ర? అమెరికా ఆందోళన

us iran war
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య జరిగిన యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను నివారించి, శాంతి స్థాపన చేసేందుకు వీలుగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఇప్పటికే ఒక అహగాహన ఒప్పందం కుదిరింది. ఇది తుది దశకు చేరుకుంది. 
 
మరోవైపు.. ఏప్రిల్‌లో మొదలైన కాల్పుల విరమణ చర్చలను దెబ్బతీసే విధంగా ఇరాన్ ఉన్నతస్థాయి ప్రతినిధులే లక్ష్యంగా ఇజ్రాయెల్ హత్యాయత్నాలకు పాల్పడే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందినట్లు సమాచారం. ఈ దాడుల గురించి ఇరాన్‌ను అప్రమత్తం చేయాలని గల్ఫ్ దేశాలను అగ్రరాజ్యం కోరినట్టు యూఎస్‌ మాజీ, ప్రస్తుత అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ లక్ష్యంగా ఈ దాడులు ఉండే అవకాశం ఉందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది.
 
ఇరాన్‌లో పాలనాయంత్రాంగాన్ని కూలదోసే లక్ష్యంతో అమెరికా-ఇజ్రాయెల్ ఫిబ్రవరి 28న దాడులు మొదలుపెట్టాయి. ఘర్షణలు తీవ్రదశలో ఉన్నప్పుడు ఘాలిబఫ్, అరాగ్చీను టార్గెట్ చేయాలని ఇజ్రాయెల్‌ యోచించినట్లు తెలుస్తోంది. దాంతో ఏప్రిల్‌లో మొదలైన చర్చలను ఆ దాడులు దెబ్బతీసి, మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతాయని అమెరికా భావించింది. దాడులు ప్రారంభమైనప్పుడు ఇరాన్ నౌకాదళం, క్షిపణ వ్యవస్థలను ట్రంప్ సైన్యం లక్ష్యంగా చేసుకోగా.. కీలక నేతలను ఇజ్రాయెల్ హతమార్చింది. తొలి రోజు దాడుల్లో నాటి సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ మరణించారు. ఆ తర్వాత ఇరాన్ ఉన్నతస్థాయి నేతలు అలీ లారిజానీ, కమాల్‌ ఖరాజీ మృతి చెందారు. వీరిద్దరితోనే అమెరికా చర్చలు జరపాలని భావించింది.
About Writer
ఠాగూర్