ఇరాన్ కొత్త నేతతో సవాల్.. యుద్ధం నుంచి ట్రంప్ సలహాదారు ఎగ్జిట్ ప్లాన్
ఇరాన్ దేశ కొత్త సుప్రీం లీడర్‌గా మాజీ నేత దివంగత అయతొల్లా ఖమేనీ వారసుడు మొజబా ఖమేనీ ఎన్నికై బాధ్యతలు కూడా చేపట్టారు. ఈ నేతతో మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదురుకావొచ్చని అమెరికా యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాదారులు యుద్ధం వద్దని సలహా ఇస్తూ వార్ ఎగ్జిట్ ప్లాన్‌ను వివరిస్తూ, ట్రంప్‌పై ఒత్తిడి తెస్తున్నారు. అయితే, ట్రంప్ సలహాదారులు ఆందోళన చెందడానికి కారణాలు లేకపోలేదు.
అమెరికా - ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే అమెరికా ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, ఇది రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి గట్టి దెబ్బ కొడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీనికితోడు ఈ యుద్ధం కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల పైకి చేరడంతో అమెరికాలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుందని ఇది ట్రంప్ పాపులారిటీని దెబ్బతీస్తుందని అంటున్నారు.
అదేసమయంలో సలహాదారుల నుంచి నలు వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నప్పటికీ ట్రంప్ మాత్రం బయటపడకుండా తనదైన శైలిలో స్పందించారు. 'మేము షెడ్యూల్ కంటే ముందే ఉన్నాం. మిలిటరీ పరంగా సాధించాల్సిన లక్ష్యాలను దాదాపుగా పూర్తి చేశాం. ఈ యుద్ధం చాలా త్వరగా ముగిసిపోతుంది' అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, 'తృప్తికరమైన విజయం'సాధించకుండా ఆయన వెనక్కి తగ్గేలా కనిపించడంలేదని మరికొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ హార్డ్‌నర్ మొజబా ఖమేనీ బాధ్యతలు చేపట్టడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చింది. ఒకవేళ ఆయన తమ డిమాండ్లకు లొంగకపోతే, ఆయనపై కూడా దాడులు చేసేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అంతర్జాతీయ అమెరికా ప్రతిష్ట దిగజారుతుందన్నది వారి అభిప్రాయంగా ఉంద.