సంబంధిత వార్తలు
- ఇపుడే ఏం కాలేదు.. ముందుంది మొసళ్ళ పండుగ : అమెరికా మంత్రి
- అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు
- Donald Trump: ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని భావించడం లేదు
- అనుకున్నదానికంటే ఎక్కువే చేశాం.. ఇరాన్‌పై యుద్ధానికి త్వరలోనే చరమగీతం.. ట్రంప్
- ఇరాన్ కొత్త సుప్రీం లీడర్‌ను మేం ఎంపిక చేస్తాం : డోనాల్డ్ ట్రంప్
శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...
ప్రపంచ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ శుభవార్త చెప్పారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా యావత్ ప్రపంచం ఇంధన కొరతతో తల్లడిల్లిపోతోంది. ఈ నేపథ్యంలో డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం ముుగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని వెల్లడించారు.
ఆయన తాజాగా మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ... నవంబరు నాటికి చమురు ధరలు పెరుగుతాయని తాను చెప్పినట్లు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారన్నారు. ధరలు పెరుగుతాయని చెప్పలేదన్నారు. ఇరాన్ యుద్ధం త్వరలో ముగిసే అవకాశం ఉందన్నారు. నవంబరులో ఎన్నికలు వచ్చే సమయానికి చమురు ధరలు భారీగా పడిపోతాయన్నారు.
చైనా హ్యాపీగా ఉందంటూ ట్రంప్ ట్రూత్‌లో పోస్ట్ చేశారు. త్వరలో హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా తెరవనున్నట్లు పేర్కొన్నారు. దీని వల్ల చైనాతో పాటు ప్రపంచమంతా లాభపడుతుందన్నారు. ఇరాన్‌కు ఆయుధాలు ఇవ్వకుండా ఉండేందుకు బీజింగ్ అంగీకరించిందన్నారు. ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్, తాము కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆయన్ను కలుస్తానన్నారు.
