సంబంధిత వార్తలు
- శుభవార్త చెప్పిన డోనాల్డ్ ట్రంప్.. చమురు ధరలు భారీగా తగ్గుగాయ్...
- అమెరికా-ఇరాన్ యుద్ధానికి బ్రేక్: పాకిస్థాన్ సంధి- 14 రోజులు గడువు
- బంగారం ధరలు ఢమాల్, మార్చి 2న 10 గ్రా. రూ. 1.72 లక్షలు, మార్చి 23న 1.39 లక్షలు
- Donald Trump: ఇజ్రాయెల్ అణు ఆయుధాన్ని ప్రయోగిస్తుందని భావించడం లేదు
- అనుకున్నదానికంటే ఎక్కువే చేశాం.. ఇరాన్‌పై యుద్ధానికి త్వరలోనే చరమగీతం.. ట్రంప్
నేను రేపిస్టును కాదు... నేను ఎవరినీ రేప్ చేయలేదు : డోనాల్డ్ ట్రంప్
తనను ప్రశ్నించిన మీడియా జర్నలిస్టుపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ.. తానేం రేపిస్టును కాదనీ, తాను ఎవరినీ రేప్ చేయలేదని అన్నారు.
శనివారం వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్‌పై దాడికి యత్నించిన వ్యక్తి మేనిఫెస్టోలోని అంశాలను ప్రస్తావించిన ఓ మహిళా రిపోర్టర్‌పై ఆయన విరుచుకుపడ్డారు. జర్నలిస్టులను భయంకరమైన వ్యక్తులు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
శనివారం రాత్రి ట్రంప్ హాజరైన వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వేదిక వద్ద కాలిఫోర్నియాకు చెందిన కోల్ థామస్ అలెన్ (31) అనే వ్యక్తి భద్రతను ఛేదించుకుని లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. పలు తుపాకులు, కత్తులతో వచ్చిన అతను, ఈవెంట్ జరుగుతున్న బాల్‌రూమ్‌కు కొద్ది మీటర్ల దూరంలోనే కాల్పులకు తెగబడ్డాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై ఆదివారం సీబీఎస్ న్యూస్‌కు ట్రంప్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ ఆరంభమంలో సంయమనంతోనే మాట్లాడారు. ఆ తర్వాత రిపోర్టర్ నోరా ఓ 'డొన్నెల్.. దాడి చేసిన వ్యక్తి మేనిఫెస్టోలోని ఒక వాక్యాన్ని చదివి వినిపించారు. "ఒక పీడోఫైల్, రేపిస్ట్, దేశద్రోహి చేసే నేరాలతో నా చేతులు మురికి కావడం ఇకపై నాకు ఇష్టం లేదు" అని అలెన్ తన మేనిఫెస్టోలో రాసినట్టు ఆమె పేర్కొన్నారు.
ఆ వాక్యం వినగానే ట్రంప్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. "మీరు ఆ వాక్యం చదువుతారని నాకు తెలుసు. ఎందుకంటే మీరు భయంకరమైన వ్యక్తులు" అని మండిపడ్డారు. "అవును, అతను అలా రాశాడు. కానీ నేను రేపిస్టు కాదు. నేను ఎవరినీ రేప్ చేయలేదు. నేను పీడోఫైల్‌ను కూడా కాదు" అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిపోర్టర్ మధ్యలో కల్పించుకోబోయినా ఆయన ఆగలేదు. "ఒక అనారోగ్యంతో ఉన్న వ్యక్తి రాసిన చెత్తను మీరు చదివి వినిపిస్తారా? నాతో ఏమాత్రం సంబంధం లేని విషయాలతో నన్ను ముడిపెట్టారు. ఈ విషయంలో నేను పూర్తిగా నిర్దోషిగా తేలాను. ఇలాంటివి చదవడానికి మీకు సిగ్గుండాలి" అని ట్రంప్ నిప్పులు చెరిగారు.
