మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : శుక్రవారం, 26 జూన్ 2015 (11:28 IST)

గాలిలో ప్రయాణిస్తూనే.. సెల్ ఫోన్ సంభాషణలు.. త్వరలో

విమానం ఎక్కగానే మనకు ఓ అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. ఎక్కువగా ఇంగ్లీషు లేదా హిందీలో వినిపించే ఈ ప్రకటన సారాంశం ‘దయచేసి మీ ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకోండి’. అయితే ఇకపై ఈ అనౌన్స్‌మెంటు ఉండకపోవచ్చు. విమానాల్లో ప్రయాణం చేస్తూనే మన ఇష్టసఖులతో మాట్లాడవచ్చు. ఈ మేరకు గల్ఫ్ స్ట్రీమ్ ఏరోస్పేస్ కార్ప్ సంస్థ భరోసా ఇస్తోంది. 
 
సరికొత్త రూటర్, శాట్‌కామ్ డెరైక్ట్ రూటర్‌ను(ఎస్‌డీఆర్)ను రూపొందించిందట. ఈ రూటర్ సాయంతో విమానాల్లో ప్రయాణించేవాళ్లు తమ స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా భూమ్మీద ఉన్నప్పుడు మాట్లాడినట్లే ఇతరులతో మాట్లాడవచ్చని, ఎస్ఎంఎస్‌లు పంపిచవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. ఇన్ కమింగ్, ఔట్ గోయింగ్ కాల్స్‌లో సాధారణ మాదిరిగానే ఫోన్లో నంబర్లు డిస్‌ప్లే అవుతాయి. 
 
ఈ ఎస్డీఆర్‌ను గల్ఫ్ స్ట్రీమ్ జి 550, జి 450 విమానాల్లో ఇన్‌స్టాల్ చేయడానికి అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ ఏఏ) ఆమోదం కూడా లభించిందని గల్ఫ్ స్ట్రీమ్ వైస్ ప్రెసిడెంట్(ప్రొడక్ట్ సపోర్ట్) మైక్ వెస్ట్ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా ఏ సర్వీస్ ప్రొవైడర్‌తో అయినా ఈ ఎస్డీఆర్ 3జీ కనెక్టివిటీని అందిస్తుందని పేర్కొన్నారు.