చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కోబ్రాలు, అవి బాతులు అని భ్రమ పడుతున్న జనం, వీడియో
చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితుల మధ్య పాముల విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది; ఒక ఆనకట్ట తెగిపోవడంతో వచ్చిన నీటి ఉధృతికి ఒక స్నేక్ ఫామ్ నుండి సుమారు 900 పాములు బయటకు కొట్టుకువచ్చి నలుదిశలా చెల్లాచెదురయ్యాయి. తప్పించుకుంటున్న ఈ పాములకు సంబంధించిన భయానక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ కోబ్రాలు అలా కొట్టుకుపోతుంటే నీటిలో బాతులు అలా పోతున్నాయేమో అని కొందరు భ్రమ పడుతున్నారు. ఐతే అవి పాములని తెలిసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ఇళ్లలో పాములు కనిపిస్తే వాటిని చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని గ్రామస్తులను హెచ్చరించారు.
చైనాలో వరదల బీభత్సం.. బ్రీడింగ్ ఫాం నుంచి 900 పాములు తప్పించుకున్నాయి!
— TeluguBulletin.com (@TeluguBulletin) July 11, 2026
చైనాలోని గ్వాంగ్సీ ప్రాంతంలో భారీ వరదలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. వరదల ప్రభావంతో ఓ పాముల బ్రీడింగ్ ఫాం నుంచి సుమారు 900 పాములు తప్పించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో స్థానికులను అప్రమత్తంగా ఉండాలని… pic.twitter.com/MCLw0W0Ntr
రోడ్లపై కనిపించిన పాముల గుంపు
చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితుల మధ్య పాముల విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది; ఒక ఆనకట్ట తెగి వచ్చిన నీటి ఉధృతికి ఒక స్నేక్ ఫామ్ నుండి సుమారు 900 పాములు బయటకు కొట్టుకువచ్చి నలుదిశలా చెల్లాచెదురయ్యాయి.
వైరల్ అవుతున్న పాముల వీడియో
తప్పించుకుంటున్న ఈ పాములకు సంబంధించిన భయానక వీడియో ఒకటి వైరల్ అవుతోంది, ఇది దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. నివేదికల ప్రకారం, వరద ప్రభావిత ప్రాంతం నుండి వచ్చిన ఒక వీడియోలో, ప్రజలు నడుము లోతు నీటిలో కర్రలు పట్టుకుని పాములను పట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. అనేక ప్రాంతాల్లో కురిసిన నిరంతర వర్షాల వల్ల వచ్చిన వరదల నేపథ్యంలో, యంత్రాంగం భారీ ఎత్తున సహాయక, రక్షణ చర్యలను చేపట్టింది.
