శుక్రవారం, 14 నవంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 13 ఆగస్టు 2025 (13:18 IST)

నాకెందుకు ఇంత తక్కువ మార్కులొచ్చాయ్: ఉపాధ్యాయురాలికి విద్యార్థి చెంపదెబ్బ (video)

Student slaps lady teacher in Thailand private school
పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే విద్యార్థులకు ఉపాధ్యాయులు లేదంటే పేరెంట్స్ సున్నితమైన దేహశుద్ధి చేస్తుంటారు. అది కూడా కొన్నిసార్లు. ఐతే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తనకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటూ ఓ విద్యార్థి ఏకంగా తన ఉపాధ్యాయురాలి చెంపను ఛెళ్లుమనిపించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
 
థాయిలాండ్‌లో 17 ఏళ్ల విద్యార్థి మిడ్ టర్మ్ పరీక్షలో రెండు మార్కులు తక్కువ వచ్చాయి. దానితో అతడు తన గణిత ఉపాధ్యాయురాలిపై హింసాత్మకంగా దాడి చేసాడు. ఈ సంఘటన ఆగస్టు 5న ఉతై థాని సెంట్రల్ ప్రావిన్స్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. విద్యార్థికి తను రాసిన పరీక్షలో 20కి 18 మార్కులు వచ్చాయి. ఐతే ఆ విద్యార్థి తనకు 20 మార్కులకు 20 ఎందుకు వేయలేదంటూ మహిళా ఉపాధ్యాయురాలిని తరగతి గదిలోనే పదే పదే చెంపదెబ్బ కొట్టడం, తన్నడం చేసాడు. ఇవి సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ కావడంతో ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.