సంబంధిత వార్తలు
- ఇరాన్‌పై అనవసర యుద్ధం చేసేందుకు అమెరికా అబద్ధం సృష్టించింది : బ్రెజిల్ అధ్యక్షుడు
- ఇరాన్‌తో యుద్ధం.. తెలుగు ప్రజలకు ఇక్కట్లు.. మధ్యతరగతి కుటుంబాలకు షాక్
- Brazil: బ్రెజిల్లో భారీ వర్షాలు- 68కి పెరిగిన మృతుల సంఖ్య
- కూలిపోయిన స్టాట్చ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం (video)
- టేకాఫ్ అవుతుండగా విమానంలో అగ్నిప్రమాదం.. 180 మంది ప్రయాణికులు పరిస్థితి??
డబ్బులు ఇచ్చి చావును కొనుక్కోవడం అంటే ఇదేనేమో..! (Video)
కొందరు వ్యక్తుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బంజీ జంప్ కోసం యత్నించిన ఓ యువతికి సేఫ్టీ తాడు కట్టడం మరిచిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూన్ 13వ తేదీన బ్రెజిల్ సావోపాలోలో బంజీ జంప్ చేస్తూ ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. సిబ్బంది సేఫ్టీ ఎక్విప్‌మెంట్ అమర్చడం మరిచిపోయారు. అదేసమయంలో ఆ యువతిని ఒక ఎత్తైన ప్రదేశం నుంచి కిందికి నెట్టేశారు. ఫలితంగా ఆ యువతి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయింది.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనకు కారణమైన వారిలో ఆరుగురుని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. బంజీ జంప్ కోసం సాహసించిన యువతికి తాడు కట్టడం మరిచిపోయారని పోలీసుల విచారణలో వెల్లడైంది. పైగా ఈ ఘటనపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేవి పూర్తిగా నమ్మకంపైనే ఆధారపడివుంటాయని, నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం పోతుందడనానికి ఈ ఘటన ఒక ఉదాహరణ అని పోలీసులు చెప్పుకొచ్చారు.
నిండుప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం..!
— Ravi Prakash Official (@raviprakash_rtv) June 14, 2026
జూన్ 13న బ్రెజిల్ సావోపాలోలో బంజీ జంప్ చేస్తూ ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది.
సిబ్బంది సేఫ్టీ ఎక్విప్మెంట్స్ పెట్టడం మరిచిపోయారని పోలీసుల విచారణలో తేలింది.
ఈ కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరిని కూడా… pic.twitter.com/736a5NMmkT
