శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:00 IST)

ప్రేమికుడు మోసం చేశాడని.. నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి హంగామా చేసింది..

ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి హంగామా చేసిన ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే..అర్జెంటీనాకు చెందిన 27 ఏళ్ల యువతి ఫాబియన్ సోసా అనే యువకుడిని గాఢంగా ప

ప్రేమికుడు మోసం చేశాడని ఓ యువతి నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి హంగామా చేసిన ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. ఆ వివరాలను పరిశీలిస్తే..అర్జెంటీనాకు చెందిన 27 ఏళ్ల యువతి ఫాబియన్ సోసా అనే యువకుడిని గాఢంగా ప్రేమించింది. ఏం జరిగిందో ఏమో తెలీదు గాని ఆ యువకుడు ఆమెను వదిలేసి వెళ్లి పోయాడు.
 
ఆ యువతి తన ప్రేమను గెలిపించుకోవడం కోసం, ప్రియుడు మళ్లీ తన దగ్గరకు వచ్చేలా చేసేందుకు వినూత్నంగా నిరసన తెలిపాలని భావించింది. అనుకున్నదే తడవుగా ఆమె నడిరోడ్డుపై దుస్తులు విప్పేసి నానా రభస చేసింది. ఈ వింత చర్య ద్వారా ప్రియుడ్ని గెలుచుకోలేదు కానీ అక్కడున్న ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ హంగామా చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 
 
పోలీసులు రంగప్రవేశం చేసి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పాపం ప్రియుడి కోసం ఏ అమ్మాయీ చేయని పనిని ఈ యువతి చేసినా.. ఫాబియన్ సోసా ఆచూకీ మాత్రం తెలియలేదు.