బుధవారం, 11 మార్చి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 22 జనవరి 2026 (11:17 IST)

ఔను, మా వద్ద వున్న రహస్య ఆయుధం ప్రపంచంలో ఎవ్వరివద్దా లేదు: ట్రంప్

donald trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజూ ఏదో ఒక చర్చనీయాంశకర విషయాన్ని బైటపెడుతూనే వున్నారు. తాజాగా మరో సైలెంట్ బాంబ్ పేల్చారు. ప్రపంచంలో ఎవ్వరివద్దా లేనటువంటి రహస్య ఆయుధం తమ వద్ద వుందనీ, దీనికి సరితూగే ఆయుధం ఏ దేశంలోనూ లేదని అన్నారు. ఈ ఆయుధం ఎలాంటిదోనన్న వివరాలే కాదు అసలు ఆ ఆయుధం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు. ట్రంప్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ... మన వద్ద ఎవ్వరికీ అంతుచిక్కని ఆయుధాలున్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకపోవడమే మంచిది. వెనిజులాపై ఈ ఆయుధాన్ని ప్రయోగించాం అంటూ చెప్పారు.
 
వెనిజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకునే సమయంలో ప్రత్యేక ఆపరేషన్ కోసం వాడిని ఆయుధం గురించి ఓ గార్డ్ చెప్పిన వివరాలు ఆశ్చర్యపరిచాయి. అతడు చెబుతూ... ఆ ఆయుధం మావద్దకు రాగానే మా ముక్కుల నుంచి రక్తం రావడం మొదలైంది. ఆ సూపర్ సోనిక్ ఆయుధం ముందు మేము నిలబడలేకపోయాము. అంతటి శక్తివంతమైన ఆయుధాలను కలిగి వున్న అమెరికాతో ఎవరైనా పోరాడగలమని అనుకుంటే అది భ్రమ అవుతుందని చెప్పాడు.