నేనింకా ప్రేమలో పడలేదు: మదాల్సా

FILE
తాను ఇంకా ప్రేమలో పడలేదని, అందుకే ప్రేమ గురించి సరైన నిర్వచనం ఇవ్వలేనని నటి మదాల్సా శర్మ పేర్కొంది. తాజాగా ఆమె అల్లరి నరేష్ సరసన ఇ.వి.వి దర్శకత్వంలో "ఫిటింగ్ మాస్టర్" చిత్రంలో నటించింది. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె తన గురించి, సినిమా గురించి పలు విషయాలను వెల్లడించింది. అవి మీ కోసం...

ప్రశ్న... మీ పూర్తి పేరు..?
జ... మదల్సా శర్మ.. అందరూ మదలసా శర్మ అని రాస్తున్నారు. నా పేరు మార్చేస్తున్నారనిపిస్తుంది.

ప్రశ్న... మదాల్సా అంటే...?
జ... మైథలాజికల్ పేరు. సరస్వతికున్న రెండోపేరు కూడా అదే.

ప్రశ్న... మీ గురించి చెప్పండి..?
జ... నేను పుట్టింది, పెరిగింది ముంబైలోనే. నాన్న సురేష్ శర్మ. పలు టీవీ సీరియల్స్‌కు దర్శకత్వం వహించారు. అమ్మ షీలాశర్మ, ఆమె నటి. గుజరాతీ సినిమాల్లో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా నటిస్తోంది. రాజశ్రీ ప్రొడక్షన్‌లో "నదియాకేపారే"లో చేసింది. నేను ప్రస్తుతం బి.ఎ. డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్నాను.

ప్రశ్న... తెలుగులోకి ఎలా రావాలనిపించింది?
జ... దక్షిణాది చిత్ర పరిశ్రమ ఎందరినో ఆదరిస్తుందనే పేరుంది. తల్లిదండ్రుల సూచన మేరకే ఈ రంగాన్ని ఎంచుకున్నా. ముందుగా తెలుగులో నటించాను. ప్రస్తుతం "కాదల్‌కు మరణం ఇల్లై" అనే తమిళ చిత్రంలో కూడా నటిస్తున్నాను.

ప్రశ్న... నటనలో శిక్షణ పొందారా?
జ... ముంబైలో కిషోర్ నమిత్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటన శిక్షణ పొందాను. డాన్స్ కూడా గణేష్ ఆచార్య దగ్గర నేర్చుకున్నా.

ప్రశ్న.. రోల్ మోడల్?
జ... మాధురీ దీక్షిత్

ప్రశ్న... హాబీలు?
జ... సంగీతం వినడం, డాన్స్ చేయడం, డ్రైవింగ్ చేయడం.

ప్రశ్న... డ్రైవింగ్ చేస్తూ ఎంతదూరం వెళతారు?
జ... చాలాదూరం వెళతాను. ముంబై పేలుళ్ల సమయంలో కూడా కారు డ్రైవింగ్‌లో చాలా దూరం తిరగాలని ప్రయత్నించాను. కొద్దిదూరం వెళ్ళగానే... నాన్నగారు ఫోన్‌చేసి వెంటనే వచ్చేయ్ అన్నారు. ఆ రోజు తాజ్‌హోటల్ మీదుగా వెళ్ళాల్సింది. నేనే ఆలస్యంగా బయలుదేరాను.

ప్రశ్న... ఎటువంటి పాత్రలు పోషించాలనుంది?
జ.. యంగ్, బబ్లీ తరహా పాత్రలు పోషిస్తాను.

ప్రశ్న... ముంబైలో అందరూ పార్టీల్లో ఎక్కువగా పాల్గొంటారు. దీనిపై మీ అభిప్రాయం?
జ... ఆరోగ్యకరమైన పార్టీల వరకే నేను పరిమితం. కానీ ఇతర పార్టీలకు మాత్రం నేను వ్యతిరేకమే.

ప్రశ్న... "ఫిటింగ్ మాస్టర్"లో ఎటువంటి పాత్ర పోషించారు?
జ... రిచ్ ఫ్యామిలీ అమ్మాయిగా నటించాను. చాలా రూఢ్‌గా ఉంటాను. ఇగో ఉన్న పాత్ర. ఎవరినీ లెక్కచేయను. అటువంటి నేను ఓ అబ్బాయి ప్రేమలో పడతాను. అది ఏమిటనేది? సినిమా చూడాల్సిందే..

ప్రశ్న... తెలుగులో మీకు నచ్చిన నటుడు?
SELVI.M|
జ... నాగార్జున


దీనిపై మరింత చదవండి :