నా జన్మ ధన్యమైందనిపిస్తోంది: సూర్య

FILE
"శివపుత్రుడు"లో విక్రమ్‌తో, "యువ"లో సిద్ధార్థ, మాధవన్‌లతో కలిసి నటించి ప్రేక్షకుల ఆధరాభిమానాలను అందుకున్న సూర్య... "గజిని"తో తనకంటూ ఓ స్పెషల్ పాలోయింగ్‌ని సంపాదించుకున్నారు. తాజాగా ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్ సమర్పణలో "ఘర్షణ" ఫేం గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేసి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా అందరి ప్రశంసల్ని అందుకుంటున్నారు.

"సూర్య సన్ ఆఫ్ కృష్ణన్" విడుదల తర్వాత అమెరికా వెళ్లిన సూర్య అక్కడి నుంచి ఫోన్‌లో మాట్లాడారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్‌ను అద్భుతంగా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సూర్యతో కాసేపు...

ప్రశ్న... సూర్య s/o కృష్ణన్ ప్రేక్షకుల మధ్య చూశారా?
జ... చూశానండి. చెన్నైలో చూశాను. హైదరాబాద్‌లో చూశాను. శాన్‌ప్రాన్సిస్కోలోనూ చూశాను. అన్నిచోట్ల ఒకే రెస్పాన్స్. నేను ఈ చిత్రం చూద్దామని వెళ్లిన ప్రతిసారీ ఆడియన్స్... షో అయిపోయాక నన్ను అభినందిస్తున్న విధానం చూస్తుంటే నా జన్మ ధన్యమైందనిపిస్తోంది.

"ఒకే చిత్రంలో 17 ఏళ్ల కుర్రాడిలా, 60 ఏళ్ల వృద్ధుడిలా అంత ఫర్‌ఫెక్ట్‌గా ఎలా చేయగలిగారు. నిజంగా రెండు క్యారెక్టర్స్ మీరు ఒక్కరే చేసినట్లు కాకుండా ఇద్దరు ఆర్టిస్టులు చేసినట్లుగా ఉంది. సినిమా చూస్తుంటే కొన్నివేల మైళ్ల దూరంలో ఉన్న మా నాన్నగారిని ఒకసారి చూసిరావాలనిపిస్తోంది." అని చాలామంది చెబుతుంటే ఈ సినిమా టార్గెట్‌ని మేము రీచ్ అయ్యామని ఎంతో సంతృప్తి కలుగుతోంది.

శుక్రవారం ఓ ఆర్మీ ఆఫీసర్ ఫోన్ చేసి ఈ చిత్రం గురించి విని, వెంటనే చూశానని, సినిమా చూశిన తర్వాత విలేజ్‌లో ఉన్న తన నాన్నగారితో మాట్లాడానని, త్వరలో వాళ్ల ఊరు వెళ్లి నాన్నతో కొన్నిరోజులు ఉండి వస్తానని చెప్పారు. అదే విధంగా...ఈ సినిమా చూసి చెన్నై నుండి ఢిల్లీలో ఉన్న తన నాన్నగారిని కలిసి అక్కడ నుంచి నాకు ఫోన్ చేశారో బ్యాంక్ ఆఫీసర్.

"సినిమాలో కొన్ని సన్నివేశాలు తమ రియల్‌లైఫ్‌లో జరిగినట్లు ఉన్నాయని తన తండ్రితో కలిసి మళ్లీ ఈ సినిమా చూడటానికి ప్లాన్ చేశానని" బ్యాంక్ ఆఫీసర్ చెబుతుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది. తండ్రి కొడుకుల బంధాన్ని గొప్పగా చూపించిన "సూర్య s/o కృష్ణన్"ను ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగానూ, తృప్తిగానూ ఉందన్నారు.

ప్రశ్న... ఈ చిత్రంలో మీకు బాగా నచ్చిన సన్నివేశం?
SELVI.M|
జ... ఇంటర్వెల్ సీన్ నన్ను బాగా టచ్ చేసింది. కళ్ళముందు ప్రియురాలు బాంబ్‌బ్లాస్ట్‌లో మరణించినప్పుడు ఆ దారుణ సంఘటనను ఫోన్‌లో నాన్నకు, అమ్మకు చెబుతూ ఏడ్చే సన్నివేశాన్ని నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇక్కడ కొడుకుగా నా బాధని తండ్రికి వివరించడం... సేమ్‌టైమ్ తండ్రిగా కొడుకు చెబుతున్న విషాద సంఘటన విని షాక్ అయి దుఃఖాన్ని దిగమింగుకుంచూ కొడుకుని ఓదార్చడం, రెండూ నేనే చేయడం ఆర్టిస్ట్‌గా ఓ ఛాలెంజ్‌గా ఫీలయ్యాను. ఆ సీన్‌కోసం చాలా కష్టపడ్డాను. ఐతే థియేటర్‌లో అద్భుతమైన రెస్పాన్స్ రావడం చూసి చాలా థ్రిల్ అయ్యాను.


దీనిపై మరింత చదవండి :