మానవ మహోపకారి ముహమ్మద్ (స) మహానీయులు దైవప్రవక్తగా నియమితులైన దగ్గరి నుండి ఇహలోకం వీడే వరకు దైవ సందేశాన్ని ఆయన దాసులైన మానవాళికి అందించడంలో నిమగ్నమై ఉండేవారు. రేయనక, పగలనక అనుక్షణం ప్రజాసంక్షేమం కోసం, వారి ఇహపర సాఫల్యం కోసమే యోచించేవారు. ప్రజల్ని అన్నిరకాల దుర్మార్గాల నుండి రక్షించి సన్మార్గ పథంపై, నిజధర్మంపైన నడిపించడానికి ఎనలేని కృషి చేసేవారు.