పొయ్యి మీద పెట్టిన పాలు పొంగిపోతే... ఇంట్లో ఉప్పు కిందపోస్తే...

Venkateswara Rao. I| Last Modified శుక్రవారం, 3 జనవరి 2014 (20:09 IST)
FILE
మనం పుట్టిన గడ్డపై పలు విశ్వాసాలు, నమ్మకాలు ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్నింటి గురించి చూద్దాం. వంటపనిలో ఉన్నప్పుడు, స్త్రీలు అనుకోకుండా ఉప్పును ఒలకబోస్తే, వారికి త్వరలో అనారోగ్యము ప్రాప్తిస్తుందంటారు. పాలు కాచే సమయంలో అనుకోకుండా ఆ సమయంలో పొంగి, పొరలిపోతే ఆ కుటుంబంలో కూడా సిరిసంపదలు అలాగే పొరలిపోతావనే విశ్వాసం చాలామందికి వుంది. చల్ల చిలికే సమయంలో కవ్వము యొక్క తల వూడినా, మజ్జిగ ఉన్న పాత్ర పగిలినా అతిత్వరలో ఆ కుటుంబం ఎవరికివారుగా చీలిపోయే ప్రమాదం వుందని గ్రహించాలి.

మేహవాతం, కీళ్ళనొప్పులు లాంటి దీర్ఘవ్యాధులతో బాధపడువారు బంగాళాదుంపలను (ఆలుగడ్డలు) ఎల్లప్పుడు తమ జేబులో భద్రపరచుకొంటే ఆ వ్యాధుల నుంచి శీఘ్రనివారణ పొందగలమనే విశ్వాసం కొన్ని ప్రాంతాలలో వుంది.

చాలాకాలంగా నాకు ఎటువంటి అనారోగ్యం లేదని సంతృప్తి పడేవారికి శీఘ్రంగా ఏదో ఒక అనారోగ్యం కలుగుతుందని అందరు విశ్వసిస్తుంటారు. బల్లమీద ఒకదాని కొకటి అడ్డంగా కత్తులు పెట్టినట్లయితే తప్పకుండా కలహం, సంభవిస్తుందంటారు. ఇలాంటి నమ్మకాలు ఇప్పటికీ కొంతమంది నమ్ముతుంటారు.


దీనిపై మరింత చదవండి :