సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఐదు తలల నాగం!

Five Head Snake
SELVI.M|
WD
తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఐదు తలల నాగుపాము ఓ కెమరామెన్ కంటికి చిక్కింది. కడంబూర్ అటవీ ప్రాంతంలో నివసిస్తున్న దశరథన్.. అడవుల్లోని చిన్నాలాట్టి ప్రాంతానికి ఫోటోల కోసం తన స్నేహితునితో బైక్‌లో బయలుదేరాడు. అటవీ అందాలను తన కెమెరాలో బంధించిన దశరథన్.. కడంబూరుకు తిరుగు ప్రయాణమయ్యాడు.

తన స్నేహితునితో కలిసి మోటార్ బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. కోట్టక్కాడు ప్రాంతాన్ని సమీపిస్తుండగా, రోడ్డు పక్కన ఓ పాము ఉండటాన్ని గమనించారు. పామును చూసి జడిసిన దశరథన్ బైక్‌ను వెంటనే ఆపేశాడు. బైక్ శబ్దానికి రోడ్డుపై ఉన్న పాము పడగ విప్పగా, అది ఐదు తలల నాగుపాముగా గుర్తించారు.

అటవీ ప్రాంతంలో నివశిస్తూ రావడంతో పాము అంటే భయంలేని దశరథన్.. తన వద్ద ఉన్న కెమెరాతో ఆ ఐదు తలల నాగును బంధించాడు. ఈ ఫోటోను ప్రింట్ చేసిన దశరథన్ సమాచారాన్ని ఈరోడ్ అటవీ శాఖ అధికారులకు తెలిపారు.

జిల్లా అటవీ శాఖ ఉన్నతాధికారి రామసుబ్రహ్మణ్యం మరియు రేంజర్లతో కలిసి ఆ ప్రాంతంలో ఐదు తలల నాగు పాము కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. కాగా, ఐదు తలల నాగు పాము ఉన్నట్టు సమాచారం బయటకు పొక్కడంతో సత్యమంగళం పరిసర గ్రామాల ప్రజల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే, ఇలాంటి పాము ఉందా అని స్థానికులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.


దీనిపై మరింత చదవండి :