ఎయిర్‌టెల్ వినియోగదారులకు బిగ్ షాక్.. ఉచిత సబ్‌స్క్రిప్షన్‌కు బంద్
ఎయిర్‌టెల్ వినియోగదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు వేల రూపాయల విలువైన ఉచిత సబ్‌స్క్రిప్షన్‌లను ఎయిర్‌టెల్ నిలిపివేసింది. గత ఏడాది ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లతో పాటు పెర్ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించింది.
మార్కెట్‌లో సుమారు రూ.17వేల విలువ ఉన్న ఈ ఏఐ సబ్‌స్క్రిప్షన్‌ను వినియోగదారులు ఎలాంటి అదనపు చెల్లింపు లేకుండా పొందారు. అయితే, ఈ ఆఫర్ 2026 జనవరి 16 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఎయిర్‌టెల్ అప్పుడే తెలిపింది. గడువు ముగియడంతో ఇప్పుడు ఈ ఆఫర్‌ను ప్రీపెయిడ్ ప్లాన్‌ల నుంచి తొలగించింది.
జనవరి 16కు ముందు పెర్ప్లెక్సిటీ ప్రో ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.