శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (13:05 IST)

అమేజాన్‌లో ప్రాడెక్టుల కోసం వెతుకుతున్నారా? కుక్కలు కనిపిస్తాయ్ జాగ్రత్త

అమేజాన్‌లో ప్రాడెక్టుల కోసం వెతుకుతున్నారా? కుక్కలు కనిపిస్తాయ్ జాగ్రత్త. ఇదేంటి అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం 'అమేజాన్' వెబ్ సైట్‌ను ఓపెన్ చేసి తమకు కావాల్సిన ప్రొడక్టుల

అమేజాన్‌లో ప్రాడెక్టుల కోసం వెతుకుతున్నారా? కుక్కలు కనిపిస్తాయ్ జాగ్రత్త. ఇదేంటి అనుకుంటున్నారు కదూ.. అయితే చదవండి. ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం 'అమేజాన్' వెబ్ సైట్‌ను ఓపెన్ చేసి తమకు కావాల్సిన ప్రొడక్టుల కోసం వెతుకున్న వారికి కుక్కల బొమ్మలు కనిపిస్తున్నాయి. అవి కాస్త ప్రాడెక్టులు వెతికే వారిని వెక్కిరిస్తున్నాయి. దీనిపై నెటిజన్లు ఫిర్యాదులు చేయడంతో అమేజాన్ స్పందించింది. 
 
తమ వైపు నుంచి ఏదో తప్పు జరిగిందని.. సమస్యను పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకుంటామని అమేజాన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. హోం పేజ్‌లోని ప్రొడక్టులను క్లిక్ చేసిన ప్రతి సారీ ఓ కుక్క బొమ్మ కనిపిస్తోందని పలువురు  సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేశారని అమేజాన్ తెలిపింది. ఇది నిజమేనని 'రాయ్ టర్స్' సహా పలు వార్తా సంస్థలు తేల్చాయి. ఈ టెక్నికల్ ఇష్యూను పరిష్కరించే పనిలో అమేజాన్ నిమగ్నమైంది.