ఐఫోన్‌ యూజర్లూ.. జర జాగ్రత్త... దాన్ని క్లిక్‌ చేస్తే మెసేజ్‌ యాప్‌ పోతుంది?

యాపిల్‌ ఐఫోన్ వినియోగదారులకు ఓ ముప్పు పొంచివుంది. దీంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ముఖ్యంగా.. ఐఫోన్‌ను మెసెజ్‌ అటాచ్‌మెంట్లతో మాల్‌‌వేర్‌ ఎటాక్‌ అవుతుందట. ఐవోఎస్‌ 9 నుంచి ఐవోఎస్‌ 10.2.1 మధ్య

apple iphone logo
pnr| Last Updated: శనివారం, 31 డిశెంబరు 2016 (13:41 IST)
యాపిల్‌ ఐఫోన్ వినియోగదారులకు ఓ ముప్పు పొంచివుంది. దీంతో వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. ముఖ్యంగా.. ఐఫోన్‌ను మెసెజ్‌ అటాచ్‌మెంట్లతో మాల్‌‌వేర్‌ ఎటాక్‌ అవుతుందట. ఐవోఎస్‌ 9 నుంచి ఐవోఎస్‌ 10.2.1 మధ్య వర్షన్లు ఉన్న ఫోన్లకు ఐమెసెంజర్‌కు ఏదైనా ఎటాచ్‌మెంట్‌ ఫైల్‌ వస్తే కంగారు పడిపోయి క్లిక్ చేయవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ముఖ్యంగా తెలియని నంబర్ల నుంచి ఏదేని సందేశం వచ్చినపుడు జాగ్రత్తగా ఉండాలి.. తాజాగా ఒక మాల్‌వేర్‌ మెసెజ్‌ యాప్‌ని ఆటోమేటిగ్గా డిజేబుల్‌ చేస్తుందని పేర్కొంటున్నారు. సంబంధిత అటాచ్‌మెంట్‌ వస్తే డౌన్‌లోడ్‌ చేయాలని క్లిక్‌ చేస్తే చాలు ముందు మెసెంజర్‌ ఫ్రీజ్‌ అవుతుంది.. దేన్ని క్లిక్‌ చేసినా తిరిగి పనిచేయదు.. చివరకు స్వైపింగ్‌ సాయంతో ఆ ట్యాబ్‌ క్లోజ్‌ చేసినా.. ఆ ఫోన్‌కు తిరిగి ఐమెసెంజర్‌ అనేది పనిచే యదు.. రీబూట్‌ లేదా రీసెట్‌ చేసుకున్నా సమస్య పరిష్కారం కావడం లేదు.

ఈ విషయాన్ని ఒక యూట్యూబ్‌ ఛానల్‌ కొనుగొంది.. దానికి సంబంధిచిన వీడియో సైతం అప్‌లోడ్‌ చేసింది.. ప్రస్తుతం ఈ మెసెజ్‌ బారిన పడిన ఐఫోన్లకు తిరిగి ఓటీఏ అప్‌డేట్‌ ఇచ్చేందుకు యాపిల్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.దీనిపై మరింత చదవండి :