ఏటీఎంలు, క్రెడిట్ కార్డులూ లేని భారత్ త్వరలోనే...

debit card
హైదరాాబాద్| raju| Last Updated: ఆదివారం, 8 జనవరి 2017 (07:35 IST)
సాంకేతికంగా శరవేగంగా జరుగుతున్న మార్పులు, డిజిటల్ చెల్లింపుల పురోగతి కారణంగా మరో మూడేళ్లలోనే భారత్‌లో ఏటీఎంలు, క్రిడిట్ కార్టులు అదృశ్యం కానున్నాయా? అంటే నిజమే అంటున్నారు నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్. ద్రవ్య సాంకేతికత మరియు సామాజిక ఆవిష్కరణల పరంగా భారత్ శరవేగంగా మార్పులకు గురికానుందని, ఈ నేపథ్యంలో వచ్చే రెండున్నరేళ్ల కాలంలోనే భారత్‌లో డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, ఏటీఎంలు, పీఓఎస్ మెషీన్లు వంటివాటికి పూర్తిగా
కాలం చెల్లిపోనుందని కాంత్ స్పష్టం చేశారు.

యూత్ ప్రవాసీ భారతీయ దివస్‌లో బాగంగా నిర్వహించిన సెషన్‌లో ప్రసంగించిన కాంత్, ప్రతి భారతీయుడూ కేవలం తన బొటనవేలిని, మొబైల్ ఫోన్‌ని ఉపయోగించి లావాదేవీలు జరపనున్నందున దేశంలో ప్రస్తుతం వ్యవహారంలో ఉన్న అన్ని కార్డులూ అప్రస్తుతం అయిపోతాయని పేర్కొన్నారు. ఆదార్ కార్డ్ ఆధారిత టెక్నాలజీ వల్ల ప్రతి లావాదేవీ కూడా కేవలం 30 సెకన్లలో పూర్తవుతుందన్నారు.

పెద్ద నోట్ల రద్దు వల్ల, డిజిటల్ చెల్లింపులు భారీ స్థాయిలో జరుగుతాయని, ప్రపంచంలోనే వందకోట్ల మొబైల్ కనెక్షన్లు, వందకోట్ల బయోమెట్రిక్‌లను కలిగిన ఏకైక దేశంగా భారత్ అవతరించిందని కాంత్ పేర్కొన్నారు. దేశంలో ఇంతవరకు 85 శాతం లావాదేవీలు నగదు రూపంలో జరుగుతుండగా, దేశంలో అతి కొద్దిమంది మాత్రమే పన్నులు చెల్లిస్తున్నారని అందుకే డిజిటల్ లావాదేవీలు, నియత ఆర్థిక వ్యవస్థను రూపొందిచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చట్టబద్ధంగా రెండు లక్షల కో్ట్ల డాలర్లు చలామణిలో ఉంటూ మరొక లక్ష కోట్ల డాలర్లు అనియతరంగంలో నల్ధ ఆర్థిక వ్యవస్థగా ఉంటున్న స్థితిలో భారత్ పది లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలంటే అసాధ్యమన్నారు. ఇలాంటి నేపథ్యంలో భారత్ అభివృద్ధి చెందడమే సాధ్యం కాదని చెప్పారు.

సంక్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ వృద్ధి రేటు 7.6 శాతంతో కొనసాగుతోందని, అభివృద్ధి ఒట్టిపోయిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పటికీ ఒయాసిస్‌గానే ఉందని నీతి అయోగ్ సీఈఓ అభిప్రాయపడ్డారు.దీనిపై మరింత చదవండి :