శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 29 సెప్టెంబరు 2016 (11:12 IST)

ఫేస్ బుక్ ఓవరాక్షన్ చేస్తోంది.. వాట్సాప్ డేటాను సేకరించడమేమిటి? వార్ మొదలు..

ఫేస్ బుక్ ఓవరాక్షన్ చేస్తోంది. వాట్సాప్ డేటాను ఫేస్ బుక్ సేకరిస్తోంది. ఇందుకు ఒప్పుకునేది లేదని హాంబర్గ్ డేటా ప్రొటెక్షన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జోహెన్స్ కాస్పర్ అంటున్నారు. రెండేళ్ల కిం

ఫేస్ బుక్ ఓవరాక్షన్ చేస్తోంది. వాట్సాప్ డేటాను ఫేస్ బుక్ సేకరిస్తోంది. ఇందుకు ఒప్పుకునేది లేదని హాంబర్గ్ డేటా ప్రొటెక్షన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ జోహెన్స్ కాస్పర్ అంటున్నారు. రెండేళ్ల కిందట ఫేస్ బుక్, వాట్సాప్‌ను సొంతం చేసుకున్నప్పుడు, రెండు కంపెనీల మధ్య ఎలాంటి డేటా మార్పిడి జరగదని వాగ్దానం చేసినట్టు కమిషన్ జోహాన్నెస్ కాస్పర్ తెలిపారు. 
 
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..? జర్మన్ యూజర్ల వాట్సాప్ డేటాను ఫేస్ బుక్ సేకరించడానికి, స్టోర్ చేయడానికి వీలులేదని ఆ దేశ ప్రైవసీ రెగ్యులేటరీ చేసిన ఆదేశాలపై ఫేస్ బుక్ కోర్టుకెక్కనుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల డేటాను ఫేస్ బుక్ షేర్ చేసుకుంటోంది.
 
ఈ విషయంపై వాట్సాప్ కొత్త పాలసీ విధానాలను కూడా ప్రవేశపెట్టింది. ఒకవేళ తమ డేటా ఫేస్ బుక్ కు షేర్ చేయడం ఇష్టలేనివారు, వాట్సాప్ వాడకాన్ని నిలిపి వేసుకోవచ్చంటూ అవకాశం కూడా కల్పించింది. డేటా సంరక్షణ చట్టాన్ని ఫేస్ బుక్ అతిక్రమిస్తుందని డేటా ప్రొటెక్షన్, ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ హాంబర్గ్ కమిషనర్ ఫైర్ అయ్యారు.