1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Jio Independence Day Offer Announced: రూ.6,000 Price Drop on 100 Mbps Broadband Plan

ఆగస్టు 15.. జియో ఫ్రీడమ్ డే ప్యాకేజీ.. రూ.6వేలు తగ్గిన ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ధర

Jio Independence Day Offer
Jio Independence Day Offer
రిలయన్స్ జియో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా వారి 100 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.6,000 తగ్గింది. దీనివల్ల 15 నెలల ప్లాన్ ఖర్చు ఇప్పుడు నెలకు సుమారు రూ.666గా ఉంటుంది. ఈ ప్లాన్ ఓటీటీ సేవలకు సంబంధించిన ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
 
ప్రస్తుతం జియో 100 ఎంబీపీఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ఈ పరిమిత కాల ఆఫర్ మైజియో యాప్‌లో కనిపిస్తోంది. అయితే జియో అధికారిక వెబ్‌సైట్‌లో ఇంకా దీని వివరాలు పొందుపరచబడలేదు. 
 
ఈ ఆఫర్ దశలవారీగా అందుబాటులోకి వస్తున్నందున, కొంతమంది వినియోగదారులకు ఇది వెంటనే కనిపించకపోవచ్చు. ఈ ప్లానును జియో ఫ్రీడమ్ డే ప్యాకేజీ అని పిలుస్తోంది. 
 
దీని ద్వారా 15 నెలల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ సాధారణ ధర రూ.16,000కు బదులుగా రూ.10,000కే లభిస్తుంది.అంటే వినియోగదారులకు నేరుగా రూ.6,000 తగ్గింపు లభిస్తుంది. లెక్కల పరంగా చూస్తే, సాధారణ నెలవారీ ఖర్చు సుమారు రూ.1,066 ఉండగా, తగ్గింపు ధరతో ఇది నెలకు సుమారు రూ.666కు పడిపోతుంది. 
 
ఈ ప్లాన్ 100 Mbps ఇంటర్నెట్ వేగాన్ని, ఎటువంటి డేటా వినియోగ పరిమితులు లేని సదుపాయాన్ని అందిస్తుంది. దీనిని తీసుకునే వినియోగదారులకు 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, 12కి పైగా ఎంటర్‌టైన్‌మెంట్ యాప్‌ల యాక్సెస్ లభిస్తుంది. 
 
ఈ ప్యాకేజీలో భాగంగా మైజియా యాప్ ద్వారా జియో హాట్ స్టార్, సోనీఎల్ఐవి, జీ5 సబ్‌స్క్రిప్షన్లు కూడా లభిస్తాయి. రిలయన్స్ జియో ప్రతి సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలపై ఇలాంటి రాయితీలను ప్రకటిస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోంది. జియో ఇటీవల తన జియో హోమ్ ప్లాన్‌లను విస్తరించింది. 
 
బ్రాడ్‌బ్యాండ్, టీవీ, ఓటీటీ సేవలను ఒకే ప్లాన్‌లో కలిపి అందించే హోమ్ ప్యాకేజీలను ప్రవేశపెట్టిన వెంటనే ఈ స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ వచ్చింది. ఈ కొత్త ప్లాన్ ధర నెలకు రూ.400 నుండి ప్రారంభమవుతుంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
ఉదయనిధి సభలో త్రిష నినాదాలు - నీళ్లు అక్కడికే చేరాలంటూ కామెంట్స్... టీవీకే నేతల ఫైర్