1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Meta to cut one in 10 jobs after spending billions on AIMeta to cut one in 10 jobs after spending billions on AI

మెటా సంచలనం నిర్ణయం : 10 శాతం ఉద్యోగులపై వేటుకు సిద్ధం...

meta
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా మరోమారు భారీగా ఉద్యోగులను తొలగించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాన్ని బలోపేతం చేసే చర్యల్లో భాగంగా, ఈ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులలో 10 శాతం మందిని తొలగించనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. బుధవారం నుంచే ఈ లేఆఫ్స్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
 
కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కొన్ని మేనేజర్ స్థాయి పోస్టులను తొలగించి, చిన్న బృందాలతో "ఏఐ-నేటివ్" నిర్మాణాలను ఏర్పాటు చేయాలని మెటా భావిస్తోంది. ఇప్పటికే ఉన్న 6,000 ఓపెన్ పొజిషన్లను కూడా మూసివేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద ఈ తొలగింపులు, బదిలీలతో కలిపి సుమారు 20 శాతం మంది సిబ్బందిపై, అంటే దాదాపు 16,000 మంది ఉద్యోగులపై దీని ప్రభావం పడొచ్చని అంచనా.
 
మెటా తీసుకున్న ఈ నిర్ణయంపై ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల కంపెనీ కార్యాలయాల వద్ద నిరసనలు తెలుపుతుండగా, మరికొందరు కంపెనీ అంతర్గత ప్లాట్ఫామ్ 'వర్క్స్'లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఏఐ సిస్టమ్‌లకు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్న కొత్త మౌస్-ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌పై గోప్యతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేస్తూ 1,000 మందికి పైగా ఉద్యోగులు పిటిషన్పై సంతకాలు చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
పూణెలో దారుణం : కదులుతున్న కారులో మహిళా లాయర్‌పై అత్యాచారం..