నోకియా నుంచి 3310.. ధర రూ. 3,500.. రెడ్, గ్రీన్, ఎల్లో కలర్ వేరియంట్‌లో?

నోకియా నుంచి కొత్త మోడల్ ఫోన్ రిలీజ్ అయ్యింది. నోకియా 3310 మోడల్.. సరికొత్త ఫీచర్లతో బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆదివారం కొత్త నోకియా 3310ను ఆవిష్కరించారు. 2005లో కనుమరుగైన ఈ మోడల్ హ్యాండ్‌స

Selvi| Last Updated: సోమవారం, 27 ఫిబ్రవరి 2017 (09:59 IST)
నోకియా నుంచి కొత్త మోడల్ ఫోన్ రిలీజ్ అయ్యింది. నోకియా 3310 మోడల్.. సరికొత్త ఫీచర్లతో బార్సిలోనా మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ఆదివారం కొత్త నోకియా 3310ను ఆవిష్కరించారు. 2005లో కనుమరుగైన ఈ మోడల్ హ్యాండ్‌సెట్‌లు అప్పట్లోనే భారీగా అమ్ముడుపోయాయి. నోకియా బ్రాండ్ లైసెన్స్ పొందిన ఫిన్‌లాండ్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ ఈ సరికొత్త మోడల్‌కు కొత్త సొబగులు అద్ది ఆవిష్కరించింది. ఇందులో అప్పట్లో అలరించిన స్నేక్ గేమ్ కూడా ఉంది. ధర సుమారు రూ.3,500లని సంస్థ విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఇక ఈ మోడల్ ఫీచర్ల సంగతికి వస్తే కలర్ డిస్‌ప్లే, 2.4 అంగుళాల స్ర్కీన్, రెండు మైక్రో సిమ్ స్లాట్స్, 2 మెగా పిక్సల్ కెమెరా, 22 గంటల టాక్‌టైమ్, 25 రోజుల స్టాండ్‌బై కలిగివుంటుందని సంస్థ తెలిపింది. అప్పటి మోడల్‌తో పోలిస్తే స్వల్ప మార్చుచేర్పులతో రాబోతోన్న ఈ ఫోన్‌కు హైపర్ రిసెస్టింగ్ హౌసింగ్ ప్రధాన ఆకర్షణ కానుంది. పాత వర్షన్ నోకియా 3310 గ్రే, బ్లాక్ ఇంకా యాఫ్ బ్లూ కలర్ వేరియంట్‌లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు.. రెడ్, గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ వేరియంట్‌లలో ఈ ఫోనును అందుబాటులోకి తేనున్నారు.దీనిపై మరింత చదవండి :