కస్టమర్లు సంతృప్తికరంగా లేరు.. వెల్‌కమ్ ఆఫర్‌ పొడగింపు దిశగా జియో

రిలయన్స్ జియో కస్టమర్లు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. నెట్‌వర్క్, కాల్ డ్రాప్ సమస్యతో పాటు తక్కువ ఇంటర్నెట్ వేగం వంటి సమస్యలను జియో కస్టమర్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వెల్‌కమ్ ఆఫర్‌ను వచ్చే యేడాది

reliance jio
pnr| Last Updated: బుధవారం, 30 నవంబరు 2016 (13:04 IST)
రిలయన్స్ జియో కస్టమర్లు ఏమాత్రం సంతృప్తికరంగా లేరు. నెట్‌వర్క్, కాల్ డ్రాప్ సమస్యతో పాటు తక్కువ ఇంటర్నెట్ వేగం వంటి సమస్యలను జియో కస్టమర్లు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వెల్‌కమ్ ఆఫర్‌ను వచ్చే యేడాది మార్చి నెలాఖరువరకు పొడగించే దిశగా రిలయన్స్ జియో యాజమాన్యం అడుగులు వేస్తోంది.

దీనికి అనేక కారణాలు లేకపోలేదు. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో పాటు స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. దీనికితోడు ఇతర టెలికాం ఆపరేటర్లు సహకరించక పోవడంతో జియో కస్టమర్లు ఉచిత వాయిస్ కాల్స్‌ వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఫ్రీ వాయిస్‌, డేటా ఆఫర్‌ను ఈ యేడాది డిసెంబర్‌ 31 తర్వాత మరింత కాలం పొడిగించే అవకాశం కనిపిస్తోంది.

మరోవైపు ఖాతాదారులను సంపాదించడంలో రిలయన్స్‌ జియో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వాణిజ్య కారకలాపాలు ప్రారంభించిన 83 రోజుల్లోనే 5 కోట్ల మందికిపైగా ఖాతాదారులను సంపాదించింది. ప్రస్తుతం నిమిషానికి వెయ్యి మంది, రోజుకు ఆరు లక్షల మంది చొప్పున కొత్త ఖాతాదారులను సంపాదిస్తుంది. ప్రపంచ టెలికాం చరిత్రలో ఇప్పటివరకు మరే కంపెనీ ఇంత వేగంగా ఖాతాదారులను సంపాదించలేదు. ఐదు కోట్ల ఖాతాదారుల మైలురాయి దాటేందుకు ఎయిర్‌టెల్‌కు 12 సంవత్సరాలు, వొడాఫోన్‌, ఐడియా కంపెనీలకు 13 సంవత్సరాల సమయం పట్టింది. రిలయన్స్‌ జియో ఈ మైలు రాయిని 83 రోజుల్లోనే పూర్తి చేసింది. దీనికి ప్రధాన కారణం ఉచిత వాయిస్ కాల్స్‌, డేటానే.దీనిపై మరింత చదవండి :