రిలయన్స్ జియో దెబ్బకు టెలికాం కంపెనీలు మటాష్

రిలయన్స్ జియో దెబ్బకు టెలికాం కంపెనీలు మటాష్ కావడం తథ్యమని సెల్యూలార్ ఆపరేటర్స్ బాడీ సీవోఏఐ వ్యాఖ్యానించింది. జియో కారణంగా మార్కెట్లో ధరలు తగ్గడం వినియోగదారులకు మంచిదే అయినా ఈ ధరలు టారిఫ్ నిబంధనలకు అన

reliance jio
pnr| Last Updated: ఆదివారం, 2 ఏప్రియల్ 2017 (17:46 IST)
రిలయన్స్ జియో దెబ్బకు టెలికాం కంపెనీలు మటాష్ కావడం తథ్యమని సెల్యూలార్ ఆపరేటర్స్ బాడీ సీవోఏఐ వ్యాఖ్యానించింది. జియో కారణంగా మార్కెట్లో ధరలు తగ్గడం వినియోగదారులకు మంచిదే అయినా ఈ ధరలు టారిఫ్ నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? అన్నదే అసలైన ప్రశ్న అని సీవోఏఐ పేర్కొంది. ధరల విషయంలో కోర్టులు, టెలికం ట్రైబ్యునల్‌లు ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడింది.

ముఖ్యంగా... 'జియో తాజా ధరల కారణంగా టెలికం రంగం కుదేలు కావడం తథ్యం, అలాగే వీటి ప్రభావం బ్యాంకులు, టెల్కోలు చెల్లించే లైసెన్స్‌ ఫీజులు, స్పెక్ట్రం పేమెంట్స్‌పైనా పడుతుంది' అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ రాజన్ మాథ్యూస్ తెలిపారు. అయితే జియో ప్రకటించిన టారిఫ్ ఆఫర్లపై మాట్లాడేందుకు మాథ్యూస్ నిరాకరించారు.

కాగా, దేశీయ టెలికాం రంగంలోకి జియో ప్రవేశించిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా టెలికాం మార్కెట్లో రిలయన్స్ జియో తీసుకొచ్చిన విప‌రీతమైన పోటీతో మిగ‌తా కంపెనీల‌న్నీ త‌మ వినియోగ‌దారుల‌ను కోల్పోకుండా ఎన్నో ఆఫ‌ర్లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే.

ఇప్ప‌టికే బీఎస్ఎన్ఎల్‌, ఐడియా, ఎయిర్ టెల్ వంటి అన్ని టెలికాం కంపెనీలు పోటీప‌డి ఆఫ‌ర్లు గుప్పించ‌గా తాజాగా అదే బాట‌లో ప‌య‌నిస్తూ నార్వేకు చెందిన టెలికాం కంపెనీ టెలినార్ ఈ రోజు ఓ అద్భుత ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది. కేవలం రూ.47 రీచార్జ్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో 56 జీబీ 4జీ డేటాను ఇస్తున్న‌ట్లు పేర్కొంది.

అలాగే, బీఎస్ఎన్ఎల్ కూడా ఇటువంటి ఆఫ‌ర్‌నే ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే ఎన్నో ఆఫ‌ర్లు గుప్పించిన‌ ఐడియా కూడా మ‌రో ప్ర‌క‌ట‌న చేసింది. ప్రత్యేక రీఛార్జీలతో త‌మ‌ పోస్ట్‌ పెయిడ్ 4జీ మొబైల్‌ వినియోగదారులకు రోజుకి 1జీబీ 4జీ
డాటాను అందించనుంది. రూ.300 యాడ్ ఆన్ ప్యాక్‌తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను అందించనున్నట్లు ఐడియా పేర్కొంది.దీనిపై మరింత చదవండి :