శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ivr
Last Modified: మంగళవారం, 1 నవంబరు 2016 (14:54 IST)

రిలయన్స్ జియో కోసం 4G VOLTE ఫోన్లను కుమ్మేస్తున్నారు...

రిలయన్స్ జీవితకాల ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యం కల్పించిన దగ్గర్నుంచి జియో సిమ్ పొందేందుకు రూ. 10 వేలు ధారపోసి ఫోన్లను కొనేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 4G VOLTE సౌకర్యం ఉన్న సెల్ ఫోన్ల అమ్మకాలు రెట్టింపైనట్లు మార్కెట్ వర్గాలు చెప

రిలయన్స్ జీవితకాల ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యం కల్పించిన దగ్గర్నుంచి జియో సిమ్ పొందేందుకు రూ. 10 వేలు ధారపోసి ఫోన్లను కొనేస్తున్నారు. తాజా గణాంకాల ప్రకారం గత ఏడాదితో పోలిస్తే 4G VOLTE సౌకర్యం ఉన్న సెల్ ఫోన్ల అమ్మకాలు రెట్టింపైనట్లు మార్కెట్ వర్గాలు చెపుతున్నాయి. ఈ సంఖ్య మూడువంతులకు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాయి. 
 
ఇలాంటి ఫోన్లలో రిలయన్స్ ఫోన్లు కూడా ఉన్నాయి. మొత్తమ్మీద రిలయన్స్ జియో దెబ్బకు ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియాలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాయి. రిలయన్స్ పోటీకి సై అంటూ అవి కూడా ఉచిత వాయిస్ కాల్స్ ఇస్తే సరి... లేదంటే చాప చుట్టేసుకోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.