రిలయన్స్ జియోపై వొడాఫోన్ కేసు.. ట్రాయ్ వంతపాడిందా.. ఫ్రీ ఆఫర్ వెనక్కి?

రిలయన్స్ జియోకు వొడాఫోన్‌తో కష్టాలు తప్పేలా లేవు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కి జియో ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చిందని.. ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టు

reliance jio-4g
Selvi| Last Updated: గురువారం, 2 ఫిబ్రవరి 2017 (15:44 IST)
రిలయన్స్ జియోకు వొడాఫోన్‌తో కష్టాలు తప్పేలా లేవు. ట్రాయ్ టారిఫ్ ఆర్డర్స్‌ను తుంగలో తొక్కి జియో ఫ్రీ ఆఫర్ తీసుకొచ్చిందని.. ట్రాయ్ కూడా నిబంధనలను ఉల్లంఘిస్తున్నా పట్టించుకోలేదని వొడాఫోన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. జియో ఫ్రీ టారిఫ్ ప్లాన్స్‌పై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ బుధవారం విచారణకొచ్చింది. జియో ఫ్రీ ఆఫర్‌కు ఏ పరిధిలో అనుమతులిచ్చారనే విషయాన్ని ట్రాయ్ కోర్టులో బహిర్గతం చేయలేదు. దీంతో కేసు విచారణ ఫిబ్రవరి 6వ తేదీ విచారణకు రానుంది.

కాగా ట్రాయ్ జియో విషయంలో మొదటి నుంచి మెతక వైఖరి అవలంబిస్తోందని.. న్యూ ఇయర్ ఆఫర్ అనే పేరుతో ఫ్రీ టారిఫ్‌ను పొడిగించినా మిన్నకుండిపోయిందని వొడాఫోన్, ఎయిర్‌టెల్‌‍తో పాటు ఇతర టెలికాం సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఒకవేళ ఈ కేసులో వొడాఫోన్ నెగ్గితే మాత్రం జియో ఫ్రీ టారిఫ్ ఆఫర్‌ను వెనక్కి తీసుకోక తప్పదని ఐటీ నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :