శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 అక్టోబరు 2016 (10:10 IST)

పేలిపోతున్నాయ్.. గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవ్వరూ వాడొద్దు.. స్విచ్ఛాప్ చేసేయండి.. శామ్‌సంగ్

శాంసంగ్ కంపెనీ తన నిజాయితీని చాటుకుంది. తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవ్వరూ వాడొద్దని, వాటిని స్విచ్ఛాప్ చేసేయాలని సదరు సంస్థ బహిర్గతంగా ప్రకటించింది. ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా.. మార్చుకున్నది ఉన్న

శాంసంగ్ కంపెనీ తన నిజాయితీని చాటుకుంది. తమ గెలాక్సీ నోట్ 7 ఫోన్లను ఎవ్వరూ వాడొద్దని, వాటిని స్విచ్ఛాప్ చేసేయాలని సదరు సంస్థ బహిర్గతంగా ప్రకటించింది. ఒరిజినల్ గెలాక్సీ నోట్ 7 ఉన్నా.. మార్చుకున్నది ఉన్నా.. దాన్ని వెంటనే స్విచ్ఛాప్ చేసేయండి అంటూ ఓ ప్రకటనలో తెలిపింది.

మార్చుకున్న  ఫోన్లు కూడా పేలుతున్నట్లు సమాచారం రావడంతో మరింత అప్రతిష్ఠ మూటగట్టుకోకుండా.. వెంటనే వాటన్నింటినీ వెనక్కి తీసుకోవాలని శామ్‌సంగ్ నిర్ణయించింది. అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లోని టాప్ కంపెనీలు ఇప్పటికే నోట్ 7 ఫోన్ల అమ్మకాలను నిలిపివేశాయి.
 
అమెరికాలోని ఒక ప్రయాణికుడు తాజాగా మార్చుకున్న ఫోన్ తీసుకెళ్తుండగా దాంట్లోంచి కూడా మంటలు రావడంతో విమానం నుంచి అందరినీ దింపేయాల్సి వచ్చింది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్ ఫోన్ తయారీదారు అయిన శాంసంగ్ తలపట్టుకుంది. వెంటనే ఆ ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని ప్రధాన మార్కెటింగ్ సంస్థలన్నింటినీ కోరింది.

అసలు సమస్య బ్యాటరీలో ఉందని భావించి, వెంటనే బ్యాటరీలు మార్చి ఇచ్చినా కూడా మళ్లీ అదే సమస్య తలెత్తుతోంది. దాంతో ఇప్పుడు మళ్లీ ఏం చేద్దామా అంటూ యోచనలో పడింది. గత రెండు నెలల్లో శాంసంగ్ తన ఫోన్ల అమ్మకాలు ఆపేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం ఇది రెండో సారి. యాపిల్ ఐఫోన్‌కు దీటుగా ఉండేలా ఈ ఫోన్‌ను ఆగస్టు నెలలో శాంసంగ్ కంపెనీ మార్కెట్లలోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.